हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Neha Gupta: అమెరికాలో… కన్నబిడ్డను చంపిన భారత సంతతి వైద్యురాలు

Vanipushpa
Neha Gupta: అమెరికాలో… కన్నబిడ్డను చంపిన భారత సంతతి వైద్యురాలు

వృత్తిరీత్యా వైద్యురాలు, ప్రాణాలు కాపాడాల్సిన తల్లే తన కన్న కూతురి పాలిట యమదూతగా మారింది. నాలుగేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన భారత సంతతి వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా(America)లోని ఫ్లోరిడా(Florida)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఒక్లహామాకు చెందిన చిన్నపిల్లల వైద్యురాలు నేహా గుప్తా(Neha Gupta) (36), తన నాలుగేళ్ల కుమార్తె ఆర్య తలాఠీతో కలిసి ఫ్లోరిడాలోని ఎల్ పోర్టల్‌కు విహారయాత్రకు వెళ్లింది. జూన్ 27న తెల్లవారుజామున 3:30 గంటలకు, అద్దెకు తీసుకున్న ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో తన కుమార్తె పడిపోయి చనిపోయిందని 911కు ఫోన్ చేసి చెప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అప్పటికే కదలకుండా పూల్‌లో ఉన్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Neha Gupta: అమెరికాలో… కన్నబిడ్డను చంపిన భారత సంతతి వైద్యురాలు
Neha Gupta: అమెరికాలో… కన్నబిడ్డను చంపిన భారత సంతతి వైద్యురాలు

ఊపిరాడకుండా చేసి చంపారు

అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. చిన్నారి ఊపిరితిత్తుల్లో కానీ, కడుపులో కానీ నీరు లేదని, నోటిపై గాయాలు ఉన్నాయని తేలింది. ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాతే మృతదేహాన్ని నీటిలో పడేశారని మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేహా గుప్తాకు, ఆమె మాజీ భర్త సౌరభ్ తలాఠీకి మధ్య పిల్లల సంరక్షణ హక్కుల (కస్టడీ) కోసం తీవ్రమైన న్యాయపోరాటం జరుగుతున్నట్లు తెలిసింది. కుమార్తె సంరక్షణను పూర్తిగా తనకే అప్పగించాలన్న నేహా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా, భర్తకు ఆమె 79,000 డాలర్లు చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు ఒత్తిడికి గురై తొందరపాటు నిర్ణయం

ఫ్లోరిడా నుంచి తన సొంత రాష్ట్రమైన ఒక్లహామాకు పారిపోయిన నేహాను, మయామీ పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను నేహా తరఫు న్యాయవాది రిచర్డ్ కూపర్ ఖండించారు. పోలీసులు ఒత్తిడికి గురై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని, పూర్తిస్థాయి విచారణలో నిజానిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం నిందితురాలిని మయామీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూకంపం వల్ల ఆధునిక కమ్యూనికేషన్, రవాణా కూడా ప్రభావితమయ్యే అవకాశముంది

read hindi news: hindi.vaartha.com

Read Also: Quad Foreign: పాకిస్తాన్ పేరును ప్రస్తావించని ‘క్వాడ్’ దేశాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870