కరోనా టీకాలపై అనుమానాలు, ఆకస్మిక గుండెపోటు మరణాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో, ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS) మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రముఖ వైద్యులు, నిపుణులు పాల్గొని, టీకాపై వదంతులను ఖండించారు. కరోనా వ్యాక్సిన్ వలన గుండెపోటు వస్తుందని చెప్పే అభిప్రాయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని వారు స్పష్టంగా ప్రకటించారు.
ICMR-AIIMS సంయుక్త అధ్యయనం నివేదిక
AIIMS తో పాటు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాన్ని సమావేశంలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఇటీవల సంభవించిన ఆకస్మిక గుండెపోటు మరణాలను పరిశీలించి, వాటికి టీకా (Corona Vaccine) తీసుకున్న తరువాత సంబంధం ఉందా అన్న కోణంలో పరిశోధన చేశారు. తుది నివేదికలో, టీకా వల్ల గుండెపోటు ప్రమాదం ఉందని ఎలాంటి ఆధారాలు లభించలేదని, స్పష్టంగా పేర్కొన్నారు.
అనవసర భయాలను వదిలేయండి: నిపుణుల సూచన
వైద్య నిపుణులు ప్రజలను ఉద్దేశించి అనవసర భయాలు, అపోహలు వీడి టీకా పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలని సూచించారు. టీకా వలన ప్రజలకు రక్షణ లభించిందే కానీ, హానికరం కాదని గుర్తు చేశారు. ఆకస్మిక గుండెపోటులకు జీవనశైలి, ఒత్తిడి, అసంతులిత ఆహారం, తార్కిక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ప్రధానంగా పనిచేస్తాయని వెల్లడించారు. కాబట్టి వ్యాక్సిన్‌పై నమ్మకంతో ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని సూచించారు.
Read Also : AI Effect : AI దెబ్బకు ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు హాంఫట్!