భౌద్దమత గురువు దలైలామా(Dalailama) వారసుడి ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా(China) డిమాండ్‌పై భారత్(India) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 15వ దలైలామా(Dalailama) ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదని ఇండియా తెలిపింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు(kiran rijiju) గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
భారత్ ధీటైన స్పందన – వారసుడు ఎవరూ కాకుండా దలైలామానే నిర్ణయిస్తారు
దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే మాత్రమే ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త దలైలామాను ఎన్నుకుంటామని చైనా చేసిన వ్యాఖ్యలపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో అలియాస్ లామా థోండుప్ స్పందించాడు. 15వ దలైలామా ఎంపిక 600 సంవత్సరాల పురాతన బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తన ట్రస్ట్ గాడెన్ ఫోడ్రాంగ్ తీసుకుంటుందని.. ఇందులో చైనా పాత్ర ఏం ఉండదని స్పష్టం చేశారు. దలైలామా 90వ పుట్టినరోజు నాలుగు రోజుల ముందు ప్రారంభమైన టిబెటన్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు.

14వ దలైలామా స్పష్టత
ప్రస్తుతం బౌద్ధ గురువుగా ఉన్న 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో మాట్లాడుతూ:
“600 సంవత్సరాల టిబెటన్ సంప్రదాయం ప్రకారంనే 15వ దలైలామా ఎంపిక జరుగుతుంది”. ఈ ప్రక్రియను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. చైనా ప్రభుత్వానికి ఇందులో ఏ హక్కూ, పాత్రా లేదు. చైనా గతంలో పాంచెన్ లామా ఎంపికలో జోక్యం చేసి తమ అనుకూల వ్యక్తిని నియమించిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఇదే మాదిరిగా దలైలామా ఎంపికపై కూడా పూర్తి రాజకీయ క్షుద్ర ప్రయోగాలు చేస్తోందని భావిస్తున్నారు.
భారత-చైనా సంబంధాల్లో కొత్త ఉద్రిక్తత?
ఈ అభిప్రాయ భేదం వల్ల: భారత్, చైనా మధ్య వ్యూహాత్మక, ధార్మిక, రాజకీయ దూరం పెరిగే అవకాశం లడాక్, అరుణాచల్ ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో, ఇది మరో ఉదయం బిందువవ్వవచ్చు.
Read Hindi news: hindi.vaartha.com
Read Also: Japan: జూలై 5 సునామీ భయంతో జపాన్ వణుకు