ఈ ఏడాది ప్రారంభం నుండి బంగారం ధర ఎవరూ ఊహించలేని విధంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ పరిస్థితి, దాని ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు బంగారం ధరను తాకాయి. దీని వల్ల బంగారం ధర ఆటుపోట్లను ఎదుర్కుంది. తాజాగా అమెరికా(America), వియత్నాం(Vietnam) మధ్య కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్రిక్తతను తగ్గించింది. ఫలితంగా, సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారం నుంచి పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో బంగారం ధర తగ్గింది. బంగారం ధర 0.3% తగ్గి ఔన్సుకు 3,345.57 డాలర్లకి చేరుకుంది. US మార్కెట్లో విక్రయించబడిన బంగారం ఫ్యూచర్ల ధర 0.1% తగ్గి 3,356.60 డాలర్లకు చేరుకుంది.
అమెరికా-వియత్నాం మధ్య తాజాగా వాణిజ్య ఒప్పందం
అమెరికా డీల్ తో వాణిజ్య ఉద్రిక్తతలు తక్కువ కావడంతో బంగారం ధరలు గురువారం స్వల్పంగా పడిపోయాయి. అమెరికా-వియత్నాం మధ్య తాజాగా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది గ్లోబల్ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇన్వెస్టర్లు ఇతర అంశాల వైపు మొగ్గు చూపారు. దాంతో సురక్షిత ఆశ్రయం అయిన బంగారం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.3% తగ్గి ఔన్స్‌కు 3,345.57 డాలర్లకి చేరింది.

ఈ ఒప్పందంలో భాగంగా, అమెరికా వియత్నాం దిగుమతులపై విధించే టారిఫ్‌ను 20%కి తగ్గించనుంది.వియత్నాం వస్తువులపై సుంకాలను 20% తగ్గించడానికి అమెరికా ఇప్పుడు అంగీకరించింది. మూడవ దేశాల ద్వారా వియత్నాం ద్వారా అమెరికాకు వచ్చే వస్తువులపై 40% సుంకం విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
వియత్నాం ‘సున్నా శాతం సుంకం’
అయితే, వియత్నాం ‘సున్నా శాతం సుంకం’ రేటుతో అమెరికా నుండి వస్తువులను దిగుమతి చేసుకోగలదని ఆయన అన్నారు. మార్కెట్లు తీవ్రమైన వాణిజ్య వేడిని ఊహించగా.. ఈ ఒప్పందం స్వల్ప ఉపశమనం ఇచ్చింది. వాణిజ్య ఒప్పందంతో వృద్ధి ఆసక్తులు పెరిగి, పెట్టుబడిదారులు మళ్లీ స్టాక్ మార్కెట్ల వైపు దృష్టి సారించారు. అయితే పెట్టుబడిదారులు దృష్టి అంతా గురువారం రాత్రి విడుదలయ్యే అమెరికా ఉద్యోగ గణాంకాలపైనే ఉన్నాయి. జూన్‌లో 1.10 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి ఉంటాయని అంచనా. మే నెలలో 1.39 లక్షలు వచ్చాయి. జాబ్స్ గణాంకాలు నిరాశపరిస్తే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు పెరుగుతాయి.
వెండి ధర 0.6% తగ్గి $36.36కి చేరింది
ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే, వడ్డీ లేని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుతం వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు పసిడిపై నుండి నిధులు వెనక్కి తీసుకుని, స్టాక్స్ వంటి రిస్కీ ఆసెట్లలో పెట్టుబడి పెడుతున్నారు.ఇ తర విలువైన లోహాల పరిస్థితి కూడా బలహీనంగానే ఉంది. వెండి ధర 0.6% తగ్గి $36.36కి చేరింది. ప్లాటినం 0.5% తగ్గి 1,412.13 డాలర్లకు చేరింది. పలాడియం 0.4% తగ్గి 1,150.28 వద్ద ఉంది.