हिन्दी | Epaper

India-US Mini Trade Deal: ఇండియా – అమెరికా మినీ ట్రేడ్ డీల్!

Shobha Rani
India-US Mini Trade Deal: ఇండియా – అమెరికా మినీ ట్రేడ్ డీల్!

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో రెండు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ (మధ్యంతర వాణిజ్య ఒప్పందం) కుదరనున్నట్లు తెలుస్తోంది (India-US Mini Trade Deal). 48 గంటల్లో అది ఖరారు కావొచ్చని, ఆ దిశగా వాషింగ్టన్‌లో చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వ్యవసాయం & డెయిరీ రంగం – ప్రధాన చిక్కుముడులు
భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, ఆటోమొబైల్‌, ఇండస్ట్రియల్‌ గూడ్స్‌, లేబర్‌ ఇంటెన్సివ్‌ ప్రొడక్ట్‌ల పైనే దృష్టిపెట్టారు. ముఖ్యంగా వ్యవసాయం, డెయిరీ రంగాల విషయంలో ఇరుదేశాల మధ్య చిక్కుముడులు నెలకొన్నాయి. భారత్‌ పాల ఉత్పత్తుల మార్కెట్‌ను విదేశీ సంస్థల కోసం తెరిచేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు అమెరికా కొన్నిరకాల ఇండస్ట్రియల్‌ గూడ్స్‌కు, ఆటోమొబైల్‌ రంగంలో రాయితీలు కోరుతోంది. విద్యుత్తు కార్లు, వైన్స్‌, పెట్రోకెమికల్స్‌, డెయిరీ, యాపిల్‌, నట్స్‌, జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో లబ్ధి కోసం పట్టుబడుతోంది. ఇక, భారత్‌ నుంచి చేసుకొనే దిగుమతులపై ట్రంప్ యంత్రాంగం విధించిన 26 శాతం టారిఫ్‌లు జులై 9 వరకు అమల్లోకి రావు. ఇక బేస్‌లైన్‌ టారిఫ్‌ 10శాతం మాత్రం వర్తిస్తోంది. ఈ చర్చల సందర్భంగా భారత్‌ 26శాతం పన్నుపై రాయితీ కోరుతోంది.

India-US Mini Trade Deal: ఇండియా - అమెరికా మినీ ట్రేడ్ డీల్!
ఇండియా – అమెరికా మినీ ట్రేడ్ డీల్!

ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల గడువు – కీలక సందర్భం
మరోవైపు.. వాణిజ్య ఒప్పందంపై (India-US Mini Trade Deal).కీలక ప్రకటన జులై 8 కంటే ముందే వెలువడవచ్చని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్న వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ (Rajesh Agarwal) వాషింగ్టన్‌లో ఉండి తుదివిడత సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇప్పటికే ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల సస్పెన్షన్‌ జులై 9వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు (Trump) వెల్లడించారు. అతిత్వరలోనే టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మినీ ట్రేడ్ డీల్ జరగొచ్చని తెలుస్తోంది.
మినీ ట్రేడ్ డీల్ ప్రయోజనాలు
దిగుమతులపై టారిఫ్ భారం తగ్గుతుంది.
రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పునరుజ్జీవనం పొందుతాయి.
లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కు నూతన అవకాశాలు.

Read Also: US: రష్యాతో వ్యాపారం మానేయండి.. భారత్‌కు అమెరికా ఆంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870