పాకిస్తాన్(Pakistan) ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం అప్పల ఊబిలో కూరుకుపోయింది. జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు చెక్ పడింది. ఇండియా(India)కు వ్యతిరేకంగా పని చేయడానికి కూడా అక్కడి స్థానికులు ముందుకు రావడం లేదు. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(Kashmir)లో భూములు, ఆస్తులు అమ్మకం పెట్టడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్(Asim Munir) జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir)పై భారతదేశంపై విషం కక్కుతున్నాడు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు అమరవీరుల హోదా ఇచ్చిన మునీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను నిర్వహించలేకపోతున్నాడు. కానీ కాశ్మీర్‌పై జులుం కక్కుతున్నాడు.

రాజా హరిసింగ్ ఆస్తులు – చరిత్రలో విలువైనవే
కొన్ని జాతీయ మీడియాలకు అందిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ POKలోని రాజా హరిసింగ్ ఆస్తులను అమ్మకానికి పెడుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆస్తులు అమ్మి ఈ దేశానికి ఉన్న అప్పులను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ఆస్తులను అమ్మడం ప్రారంభించింది. ఈ ఆస్తులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్, సియాల్‌కోట్, రావల్పిండి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో విక్రయించారు. POKలోని మైన్స్, భూములు లాహోర్, రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా వరకు విస్తరించి ఉన్నాయి. విభజనకు ముందు, జమ్మూ కాశ్మీర్ స్వదేశీ సంస్థానాన్ని పాలించే రాజా హరిసింగ్ ఆస్తి. పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్‌కోట్, రావల్పిండి, జీలం, షేక్‌పురా, ఖైబర్ పఖ్తుంఖ్వా అంతటా ఇది విస్తరించి ఉంది.
అసిమ్ మునీర్ వ్యాఖ్యలు – ఉగ్రవాదులకు అమరవీరుల హోదా
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉగ్రవాదులను అమరవీరులుగా పరిగణిస్తూ భారత్‌పై వ్యాఖ్యలు చేస్తుండటం విమర్శలకు గురవుతోంది. కానీ తాను నిర్వహించలేని POKపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని భారత మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. 1961లో పాకిస్తాన్ POK ఆస్తులను సక్రమంగా నిర్వహించడానికి ఒక ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ భారీగా అప్పుల భారంతో కుంగిపోయింది. షాబాజ్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి, చైనా, నుంచి బిలియన్ డాలర్ల రుణాలు తీసుకుంది.
Read Also: Top Billionaires : న్యూయార్క్ లో టాప్ బిలియనీర్స్