తెలంగాణలో వాతావరణ పరిస్థితులు వచ్చే రెండు రోజులు పెద్దగా మారనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.బుధవారం, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది వ్యవసాయ రంగానికి, సాధారణ ప్రజల దినచర్యకు గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భయటకు పనులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా బుధవారం అంటే నేడు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ (Asifabad), మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలకు పేరుపొందాయి, కాబట్టి ఈ వర్షాలు వేడి నుంచి ఉపశమనం కలిగించగలవు. అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అంతరాయం కలగవచ్చు. హైదరాబాద్ (Hyderabad) తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురవవచ్చని అంచనా వేస్తున్నారు. నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో
వర్షాల నేపథ్యంలో ప్రజలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన ఆశ్రయం తీసుకోవాలి. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండటం మంచిది. బలమైన గాలుల సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపాలి. రైతు (Farmers) లు తమ పంటలకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, సాగు పనులను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
వర్షాల కారణంగా ప్రభావితమయ్యే రంగాలు
వర్షాలు కేవలం వాతావరణ మార్పులకు సూచిక మాత్రమే కాకుండా, అనేక రంగాలపై దాని ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వ్యవసాయరంగం (Agriculture) వర్షాలకు బాగా ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో సాగు పనులు చేస్తున్న రైతులకు ఈ వర్షాలు ఉపయోగపడవచ్చు. అయితే, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.
ప్రజలపై ప్రభావం
ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు వెళ్లి పనిచేసే వాణిజ్య కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వర్షపాతం అధికంగా ఉంటే, రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్, లోతట్టు ప్రాంతాల్లో నీటి ముంపు, విద్యుత్ (Electric city)అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చు.వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలవకూడదు. ఎలక్ట్రిక్ పోల్లు, తడి ప్రదేశాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. వర్షం, గాలి అధికంగా ఉన్న సమయంలో వాహనాలు నెమ్మదిగా నడపాలని ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచిస్తోంది.

ప్రమాదాలను నివారించవచ్చు
ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో ఇలాంటి వాతావరణ మార్పులు సాధారణం. అయినప్పటికీ, వాతావరణ కేంద్రం ఇచ్చిన హెచ్చరికలను సీరియస్గా తీసుకోవడం ద్వారా అనవసర ప్రమాదాలను నివారించవచ్చు. స్థానిక అధికారులు (Officers) కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నగరాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలను పర్యవేక్షించి, నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో తొందరగా ఎంటర్ అయినా మధ్యలో తిరోగమించాయి. ప్రస్తుతం మళ్లీ వర్షాలు జోరందుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: TGSRTC: రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నూతన భవనానికి శంకుస్థాపన