మెరుగైన సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు
డిటిఆర్ స్థాయిలో నిరంతరం సరఫరా పర్యవేక్షణ
టిజిఎస్ పిడిసిఎల్ ముషారఫ్ ఫరూఖీ
హైదరాబాద్: విద్యుత్ అధికారులు వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రతి బుధవారం బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాలు చేపట్టాలని దక్షి ణ తెలంగాణ (Telangana) విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. ఈమేరకు సోమవారం మింట్ కాంపౌండ్ లోనిసంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డీఈలతో సమావేశం నిర్వహించారు.

ఎఐ సేవలను అందుబాటులోకి
ఈసందర్భంగా సిఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థ పరిధిలో 8681,11 కేవీ ఫీడర్లు ఉండగా వాటిలో 6885 ఫీడర్ల పరిధిలో ఫీడెర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా విద్యుత్ సరఫరా పర్యవేక్షణ జరుగుతుందని మిగతా ఫీడర్లను కూడా ఈ సిస్టమ్ పరిధిలోకి వస్తామన్నారు. విద్యుత్ డిమాండ్, సరఫరా, అంతరాయాలు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసి సంబంధిత ఇంజినీర్లను అప్రమత్తం చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ స్థాయిలో ఎఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తేను న్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సరఫరా, లోపాలను గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత సేవలు దోహదం చేస్తాయని తెలిపారు. అదే విధంగా, ప్రతి రోజు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ స్థాయిలో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ నిర్వ హించాలని, తరచుగా సమస్యలు ఎదుర్కొం టున్న ఫీడర్లపై, డిటిఆమ్లపై డివిజనల్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అలాగే స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ ఏడాదికి ఏడాదికి భారీగా పెరుగుతుందని దానికి తగట్టుగా చేపట్టాల్సిన చర్యలపై ఆగస్టు 15 లోగా నివేదికలు రూపొందించాలన్నారు. కార్యక్రమం లో డైరెక్టర్ ప్రాజెక్ట్స్- వి. శివాజీ, డైరెక్టర్ ఆప రేషన్ డా. నర్సింహులు, డైరెక్టర్ కమర్షియల్- చక్రపాణి, డైరెక్టర్ ఫైనాన్స్-పి కృష్ణారెడ్డి, జోనల్ చీఫ్ ఇంజినీర్స్ సాయి బాబా, ఎల్ పాండ్య, యు.బాల స్వామి, ఏ కామేష్ తదితరులు పాల్గొన్నారు.
Read also: HIV: హెచ్ఐవి బాధితులకు చేయూత