ఈశాన్య భారతదేశానికి ప్రవేశద్వారంగా ప్రసిద్ధిగాంచిన గౌహతి (Guwahati) అస్సాం రాష్ట్రానికి సాంస్కృతిక, ఆర్థిక, పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున విస్తరించి ఉన్న ఈ నగరం, చారిత్రక వారసత్వంతో పాటు ప్రకృతి అందాలతో సంతృప్తిని కలిగించే అనేక పర్యాటక కేంద్రాలకు మధుర ప్రారంభబిందువు.గౌహతి చుట్టుపక్కల అనేక హిల్ స్టేషన్‌లు ఉన్నాయి, ఇవి ప్రకృతి ప్రేమికులకు, హిమాలయ శిఖరాలను ఆస్వాదించాలనుకునే వారికి ఉత్తమ గమ్యస్థానాలు. ఈ హిల్ స్టేషన్లు మీకు ఉత్తేజకరమైన అనుభవంతో పాటు శాంతియుత విశ్రాంతి ఇవ్వగలవు. ఇప్పుడు గౌహతి నుండి ప్రయాణించగల టాప్ 5 హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం.
షిల్లాంగ్ (Shillong)
షిల్లాంగ్ ఈశాన్య భారతదేశంలో అత్యంత పెద్ద హిల్ స్టేషన్. సందర్శకులు ఇక్కడకిగౌహతి నుంచి 100 కిలోమీటర్లు కారులో ప్రయాణించి చేరుకోవచ్చు. సముద్ర మట్టానికి 1,496 మీటర్ల ఎత్తులో చల్లని వాతావరణంలో ఉంటుంది. ఎలిఫెంట్ ఫాల్స్, సెవెన్ సిస్టర్స్ ఫాల్స్, ప్రశాంతమైన వార్డ్స్ లేక్ ఉమియం లేక్ సరస్సులతో పొగమంచు కొండలతో విలసిల్లుతున్న దీన్ని “తూర్పు స్కాట్లాండ్” అంటారు. పోలీస్ బజార్ వంటి మార్కెట్లు సాంస్కృతిక వాతావరణనికి ప్రసిద్ధి. సాహస ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ సాహసాలు, గుహ కార్యకలాపాలు, రాక్ క్లైంబింగ్ సవాళ్ల వంటి ఉత్కంఠభరితమైనవి చాల ఉన్నాయి.

చేరాపుంజి (Cherrapunji)
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు చిరపుంజీకి వస్తారు. ఇది భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రాంతాలలో ఒకటి. గౌహతికి సరిగ్గా 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం సముద్ర మట్టానికి దాదాపు 1,300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ సమృద్ధిగా ఉన్న పచ్చదనం, నోహ్కాలికై జలపాతం, డైంత్లెన్ జలపాతం వంటి అద్భుతమైన జలపాతాలు ఆకర్షిస్తాయి. ఖాసీ తెగ నిర్మించిన లివింగ్ రూట్ వంతెనలు చూడవచ్చు. చిరపుంజీలో సందర్శకులు ఆకర్షణీయమైన దృశ్యాలను ఆనందిస్తారు.

మావ్లిన్నాంగ్ (Mawlynnong)
పర్యాటకులు సాధారణంగా మావ్లిన్నాంగ్‌ను “దేవుని స్వంత తోట” అని పిలుస్తారు. ఈ స్థావరం షిల్లాంగ్ నుంచి 95 కిలోమీటర్లు, గౌహతి నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిశుభ్రతకు అంకితభావంతో ఈ గ్రామం ఆసియా (Asia) లోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రపంచ అధికారులతో గుర్తింపు పొందింది. ఇక్కడ ఉత్కంఠభరితమైన లోయ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచచ్చు. వేలాడే వెదురు మార్గం సాహసోపేతమైన దృశ్యాలను అన్వేషకులకు అందిస్తుంది.

నోంగ్‌ఖైల్లెం(Nongkhaillem)
నోంగ్‌ఖైల్లెం వన్యప్రాణుల అభయారణ్యం సందర్శకులకు పూర్తి నిశ్శబ్దంగా ఉంటుంది. 29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం గౌహతి (Guwahati) కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఏనుగులు, చిరుతలు, వివిధ పక్షి జాతులను వీక్షించవచ్చు. ఇక్కడ దట్టమైన అడవులు, వంకర కొండలలో పక్షులను చూడటానికి, నిశ్శబ్దం గుండా ట్రెక్కింగ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్.

ఉమియం సరస్సు(Lake Umiam)
ఉమియం సరస్సు షిల్లాంగ్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన స్టాప్‌ఓవర్‌గా నిలుస్తుంది. గౌహతి సమీపంలో సృష్టించబడిన కృత్రిమ జలాశయం (artificial reservoir) ఇది. 15 కిలోమీటర్ల దూరంలో పచ్చని వృక్షసంపదతో కప్పబడిన సుందరమైన కొండల మధ్య ఉంది. ఇక్కడ పిక్నిక్‌లతో పాటు బోటింగ్, కయాకింగ్ ప్రసిద్ధి. వేడి వేసవి రోజుల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రదేశం మంచి ఎంపిక.

Read Also: Delhi: టెంపోలో ముందు సీటు కోసం గొడవ.. తండ్రిని చంపిన కొడుకు