భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు (PV Narasimha Rao) గారు 104వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ పీవీ సేవలను స్మరించుకుంటూ తమ స్మృతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మహనీయుడు పీవీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కొనియాడారు. పీవీ నరసింహారావు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు.

తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను”అదే విధంగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పీవీకి నివాళులర్పించారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తి గడించారని లోకేశ్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: TTD: తిరుమల దర్శనాల పేరుతో మోసపోయిన తెలంగాణ భార్యాభర్తలు