కోల్‌కతాలో మరో దారుణం వెలుగు చూసింది. గతేడాది ఆర్జి కార్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు. తాజా మరోసారి కోల్‌కతాలోని ఒక విద్యా సంస్థలో ఒక విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఒక లా కాలేజీ (Law College) లో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.ముఖ్యంగా లా కాలేజీలోనే ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా మిగతా ఇద్దరు ప్రస్తుత విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
సామూహిక అత్యాచారం
ఈ సామూహిక అత్యాచార ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో బాధితురాలినే నిందించేలా ఎంపీ మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయంలో, ముఖ్యంగా చెడు మనస్తత్వం ఉన్న పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన చేసిన సూచన వివాదాస్పదమైంది. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం (Gang rape) ఘటనపై కల్యాణ్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, “అత్యాచారం చేసింది ఆమె సొంత స్నేహితులే కదా. క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించలేరు. అలాంటప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఆమె స్నేహితులే.

మహిళా సంఘాలు
కాపాడాల్సిన స్నేహితులే ఆమెపై అత్యాచారానికి పాల్పడితే, ఇక కాలేజీ యాజమాన్యం గానీ, పోలీసులు గానీ ఏం చేయగలరు?” అని ప్రశ్నించారు. కాలేజీతో, కాలేజీలోని వారితో సంబంధం లేకుంటే పూర్వ విద్యార్థి క్యాంపస్ లోకి ఎలా ప్రవేశిస్తాడని ప్రశ్నించారు.ఒక ప్రజాప్రతినిధిగా అత్యాచార బాధితురాలికి అండగా నిలవాల్సిన కళ్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee), బాధితురాలిదే తప్పన్నట్లు మాట్లాడటంపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు బాధితురాలిని అవమానించేలా ఉన్నాయని, ఇది బాధ్యతారాహిత్యమని పలువురు విమర్శిస్తున్నారు.
Read Also: Shefali Jariwala: గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి