ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran) దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్(Iran) ఉల్లంఘించిందని దానికి గట్టిగా బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్(Israel) హెచ్చరికలు పంపింది. దీనికి ఇరాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఇజ్రాయెల్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, కయ్యానికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. అయితే ఈ వార్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) రెండు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
దౌత్యపరమైన వ్యూహాంలో భాగంగానే భారత్ మౌనం
అయితే భారత్ మాత్రం ఈ వార్ మీద మౌనంగా ఉంది. తాజాగా పశ్చిమాసియాలో ఘర్షణల పరిష్కారం దిశగా తమ వంతు కృషి చేసేందుకు సిద్ధమేనని భారత్ ప్రకటించింది.అయితే ఎక్కువగా మౌనాన్నే ఆశ్రయించింది భారత్.. మరి ఎందుకు మౌనంగా ఉందని ఆలోచిస్తే దౌత్యపరమైన వ్యూహాంలో భాగంగానే భారత్ మౌనాన్ని ఆశ్రయించిందని చెప్పుకోవచ్చు.
భారత్ రెండు దేశాలతో దౌత్య పరంగా మంచి సంబంధాలను కలిగి ఉంది. ఇప్పుడు ఏ దేశానికి సపోర్ట్ ఇచ్చినా ఇంకో దేశానికి దౌత్యపరంగా శత్రువు అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కారు మౌనంగా ఉండటమే మేలని భావిస్తోంది. భారత్ ఈ రెండు దేశాల మధ్య వార్ విషయంలో కలుగజేసుకుంటే దాదాపు రూ. 57,488 కోట్ల వాణిజ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

భారతదేశానికి ఇంధన అవసరాలు
భారత్ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఇరాన్ తో 1.68 బిలియన్ డాలర్లు వాణిజ్యం కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశానికి ఇంధన అవసరాలు చాలా ముఖ్యం.పైగా ఆగ్నేయ ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. అలాగే భారత్ నుంచి ఇరాన్ బాస్మతి బియ్యాన్ని భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటోంది.అలాగే టీ సంబంధిత ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు భారత్ రెండు దేశాల మధ్య యుధ్దంలో తలదూర్చితే ఈ వాణిజ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్‌తో వాణిజ్య సంబంధాలు
మరో దేశం ఇజ్రాయెల్ తో 1.68 బిలియన్ డాలర్లు వర్తకాన్ని భారత్ కొనసాగిస్తోంది.దీంతో పాటుగా ఇజ్రాయెల్-భారత్ మధ్య రక్షణ సాంకేతిక రంగంలో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సంబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అధునాతన రక్షణ పరికరాలు, సాంకేతికతను భారతదేశానికి ఇజ్రాయెల్ అందిస్తోంది.
హార్ముర్ జలసంధి: ప్రపంచవ్యాప్తంగా చమురు వాణిజ్యానికి హార్ముజ్ జలసంధి ప్రధానమైనది. భారత్ కూడా ఈ జలసంధి నుండి ఎక్కువ భాగం చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుధ్దంలో కలుగజేసుకుంటే చమురు వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమై పెట్రోలో, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటూ పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో భారత్ కలుగజేసుకుంటే అటు ఎగుమతులు, ఇటు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారత్ రెండు దేశాల్లో ఏ దేశానికి మద్దతు తెలిపే ఛాన్స్ ఉండదు.
Read Also: Stock market: యుద్ధ భయాలు ఉన్నా లాభాల్లోనే సూచీలు