సాంగ్లీ జిల్లాలో దారుణం – తండ్రి చేతిలో కుమార్తె హత్య
మహారాష్ట్ర(Maharastra) సాంగ్లీ జిల్లా(Sangli District), అట్పాడి తహసీల్ లోని నెల్కరంజి గ్రామంలో 16 ఏళ్ల బాలిక తన తండ్రి చేతిలో తక్కువ మార్కులు వచ్చిందన్న కారణంతో హత్యకు గురైంది.
తండ్రే ఉపాధ్యాయుడు – చదువులో వైఫల్యం మనస్తాపానికి దారి
నిందితుడు ధోండిరామ్ భోసలే (45), స్వయంగా ఒక పాఠశాల ఉపాధ్యాయుడు(School Teacher).
తన కుమార్తె 12వ తరగతిలో సాధన పరీక్షలో తక్కువ మార్కులు(Low marks) సాధించిందని ఆవేశానికి లోనయ్యాడు. ఈ విషయంపై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

గ్రైండర్ చెక్క హ్యాండిల్‌తో దాడి – మృతికి కారణం
ఆవేశంతో రాతి గ్రైండర్‌కు ఉపయోగించే చెక్క హ్యాండిల్‌ను తీసుకుని, భార్య, కుమారుని ఎదుటే కుమార్తెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధిత బాలికను ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బహుళ గాయాలే మృతికి కారణం అని అట్పాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ వినయ్ బహిర్ తెలిపారు. పిండి తయారు చేయడానికి ఉపయోగించే రాతి గ్రైండర్ చెక్క హ్యాండిల్‌ను నిందితుడు పట్టుకుని, అతని భార్య మరియు కొడుకు సమక్షంలో దానితో బాలికపై దాడి చేశాడని అధికారి తెలిపారు.”ఆ టీనేజర్‌ను సాంగ్లిలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆమె బహుళ గాయాలతో మరణించిందని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది” అని అట్పాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ వినయ్ బహిర్ తెలిపారు.
తల్లి ఫిర్యాదు – హత్య కేసులో తండ్రి అరెస్టు
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా: తండ్రిని అరెస్టు చేశారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదువు ఒత్తిడికి భయకరం – మానవత్వం మరిచిన తండ్రి. ఈ సంఘటన మానవ సంబంధాల్లో సహనం లేకపోవడం, బాలికల పట్ల ఉదాసీన ధోరణి, మరియు చదువు పేరుతో నిత్యం ఎదురు కావాల్సిన మానసిక ఒత్తిడిని ప్రశ్నించేలా మారింది. తన కుమార్తె 12వ తరగతిలో సాధన పరీక్షలో తక్కువ మార్కులు సాధించిందని ఆవేశానికి లోనయ్యాడు. ఈ విషయంపై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Read Also: Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం