ప్రకృతి మనకు అందించిన అద్భుతాలలో నదులు ఒకటైనవి. అవి మానవ జీవన విధానానికి ఎంతో కీలకమైనవి. పుట్టిన చోటు నుంచి వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ అనేక రాష్ట్రాలు, దేశాల్ని దాటి సాగరంలో కలుస్తాయి. నదులు (Rivers) కేవలం జలస్తోత్రమే కాకుండా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి పొడవైన నదులు, వాటి విశిష్టతల గురించి తెలుసుకుందాం.
నైలు నది (Nile River)
నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 6,650 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఈ నది ప్రధానంగా ఇది ఆఫ్రికాలో ఉంది.ఇది భారతదేశంలో కూడా అతి పొడవైన నది. ఈ నది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈజిప్షియన్ నాగరికత (Egyptian civilization) నాటిది. నైలు నది, సూడాన్, ఈజిప్ట్ సహా 11 దేశాల గుండా ప్రవహిస్తూ,మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.

అమెజాన్ నది (Amazon River)
అమెజాన్ నది పొడవులో రెండవదైనా, ప్రవాహ పరిమాణం పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద నది. దాదాపు 6,400 కిలోమీటర్లు పొడవుతో ఇది దక్షిణ అమెరికాలో బ్రెజిల్, పెరు, కొలంబియా వంటి దేశాల మీదుగా ప్రవహిస్తుంది. అమెజాన్ అడవి (Amazon forest) ప్రపంచంలోని అత్యంత జైవైవిధ్యాన్ని కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.అత్యంత సుందరమైన నదుల్లో కూడా ఇది ఒకటి, అమెజాన్ నది, జీవ వైవిధ్య పర్యావరణానికి జీవనాడి అని అంటారు. ఇక ఇది కొలంబియా, బ్రెజిల్ గుండా ప్రవహించి, అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోతుంది.

యాంగ్సీ నది (Yangtze River)
యాంగ్సీ నది చైనా దేశంలో ప్రవహించే అతి పొడవైన నది. ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో మూడో స్థానంలో ఉండే యాంగ్సీ నది, ఇది సుమారు 6,300 కిలోమీటర్లు పొడవు కలిగి ఉంది. ఇది ఆసియా ఖండంలో అతి పెద్ద నది కూడా. చైనా (China) లో వ్యవసాయానికి, పారిశ్రామిక అవసరాలకు ప్రధాన నీటి మూలంగా ఉంది.ఇది చైనాలో మాత్రమే ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట అయిన త్రీ గోర్జెస్ ఆనకట్టకు నిలయంగా ఉంది. అందమైన నదుల్లో ఇది కూడా ఒకటి.

మిస్సిసిపి-మిజౌరీ నది (Mississippi-Missouri River System)
ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో మిస్సిస్సిప్పి, మిస్సౌరీ నది ఒకటి. ఇది మిస్సిస్సిప్పి, మిస్సోరి, జెఫెర్సన్ నదుల సంగమం. ఈ నది ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో నాలుగో స్థానంలో ఉంటుంది. అంతే కాకుండా ఎత్తైన పర్వతాల (High mountains) గుండా ప్రవహించే ఈ నది చూడటానికి చాలా అందంగా ఉంటుంది.ఈ నది వ్యవస్థ అమెరికాలో ఉన్నది. ఇది 6,275 కిలోమీటర్లు పొడవుతో ఉత్తర అమెరికాలోని అతి పొడవైన నదిగా గుర్తించబడింది. ఇది అనేక రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కలుస్తుంది.

యెనిసే నది (Yenisei River)
ఈ నది రష్యాలో ఉంది.ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో యెనిసీ నది ఒకటి. ఇది రష్యా, మంగోలియా (Mongolia) కు ఎంతో ప్రయోజకరమైన నది.యెనిసీ–బైకాల్–సెలెంగా నదీ వ్యవస్థ దాదాపు 3,487 కిలోమీటర్లు (2,110 మైళ్ళు) పొడవు ఉండి, మంగోలియా నుండి మధ్య సైబీరియా మీదుగా ఆర్కిటిక్ మహాసముద్రం వరకు ప్రవహిస్తుంది.ఇది ఉత్తర ఆసియాలోని ప్రధాన నదుల్లో ఒకటి.

Read Also: ENG vs IND: టాస్ ఓడిన గిల్.. తొలి టెస్ట్‌లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్