हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel-Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

Anusha
Israel-Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వైరం రోజురోజుకూ మరింత పెరిగి యుద్ధ స్థితికి చేరిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు సైతం అప్రమత్తమవుతున్నాయి.ఈ యుద్ధంలోకి అమెరికా, చైనాలు రంగంలోకి దిగనున్నాయనే వార్తలు వస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధం (War) మరింత తీవ్రం అయితే అంతర్జాతీయ చమురు ధరలపై ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

కేంద్రమంత్రి స్పష్టం

ఈ నేపథ్యంలోనే ఇవన్నీ ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు.అంతర్జాతీయంగా చమురు ధరలపై ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రభావం ఉంటుందని హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) అంగీకరించినప్పటికీ, ప్రస్తుతానికి ఎటువంటి ముప్పు లేదని తేల్చి చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా, నియంత్రణలోనే ఉన్నాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా చమురు కొరత లేదని, ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని తెలిపారు. అంతర్జాతీయం (International) గా చమురు ధరలు పెరిగితే భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయని జరుగుతున్న ప్రచారంపై హర్దీప్ సింగ్ పూరీ క్లారిటీ ఇచ్చారు.

Israel-Iran Crisis

కేంద్ర ప్రభుత్వానికి

జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఇది అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర పెరగడం ఖాయమని వార్తలు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ (Petrol, diesel) ధరలపై పెంపు పక్కా అనే ఊహానాగాలను హర్దీప్ సింగ్ పూరీ కొట్టిపారేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతున్న వేళ తీవ్ర అనిశ్చితి వాతావరణం ఏర్పడిందని అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడగలమనే నమ్మకం కేంద్ర ప్రభుత్వానికి (Central Government)ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే దేశంలో చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పిన కేంద్రమంత్రి అంతర్జాతీయంగా చమురుకు కొరత కూడా లేదని అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Read Also: Pavel Durov: పెళ్లి కాకపోయినా నాకు 100 మంది పిల్లలున్నారు.. టెలిగ్రామ్ CEO సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870