దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితురాలిగా రాజా రఘువంశీ భార్య సోనమ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా వెలుగుచూసిన అంశం అందరిలోనూ కలకలం రేపుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ‘సంజయ్ వర్మ’ అనే వ్యక్తితో సోనమ్ అత్యధికంగా మాట్లాడినట్లుగా ఫోన్ కాల్ డేటా రికార్డు (Phone call data record) లో తేలింది.ఆ వ్యక్తి ఎవరు? ఆయన పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలు అందరినీ ఊహలలోకి నెట్టాయి. కానీ తాజాగా పోలీసులు ఈ మిస్టరీను ఛేదించారు. ‘సంజయ్ వర్మ’ అని నమోదు చేసిన మొబైల్ నంబర్ అసలు పేరు రాజ్ కుశ్వాహా అని నిర్ధారించారు. అంటే సోనమ్‌తో వివాహం జరిగిన తరువాత కూడా ఆమె తన ప్రియుడితో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.
పథకం రచించాడని
ఇంట్లోవాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే రాజ్ కుశ్వాహా నంబర్‌ను ‘సంజయ్ వర్మ’గా సేవ్ చేసుకుందని పోలీసులు వెల్లడించారు.సోనమ్ రఘువంశీ, రాజ్ కుశ్వాహా మధ్య సంబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ ప్రేమ వ్యవహారమే చివరికి హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, రాజ్ కుశ్వాహా (Sonam, Raj Kushwaha) మధ్య 39 రోజుల వ్యవధిలో 234 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయని డేటాలో తేలింది. ఇది చూసిన అధికారులు, వీరిద్దరి మధ్య గాఢమైన సంబంధం ఉందని స్పష్టంగా తెలిపారు.ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ స్విచ్ఛాఫ్ ఉంది. ఈ హత్యకు రాజ్ కుశ్వాహానే పథకం రచించాడని పోలీసులు స్పష్టం చేశారు.కాగా, “సంజయ్ వర్మ” గురించి తనకు తెలియదని సోనమ్ సోదరుడు గోవింద్ తెలిపారు. “ఈ కేసులో సంజయ్ పేరు కూడా వస్తోందని ఇవాళే తెలిసింది” అని ఆయన అన్నారు.

నాంగ్రియాట్ గ్రామంలోని
రాజా (Raja Raghuvanshi) హత్యకు సోనమ్ ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇండోర్‌కు చెందిన రాజా, సోనమ్‌లకు మే 11న వివాహం జరిగింది. సోనమ్, తన కుటుంబ ఫర్నిచర్ యూనిట్ అకౌంటెంట్ రాజ్‌తో అప్పటికే సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయ (Meghalaya) వెళ్లిన ఈ జంట, మే 23న నాంగ్రియాట్ గ్రామంలోని హోంస్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభించింది. సోనమ్ (Sonam) జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమై నందగంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. అంతకుముందే కిరాయి హంతకులు ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మీలను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 11న సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.
Read Also: Visa: అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రారంభం