ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఐక్యత లేదని, కూటమి పని అయిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) ఘాటుగా స్పందించారు. ఇండియా కూటమి(India Kutami) చాలా బలంగా ఉందని, చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని, వారిని ఎవరూ ఆపబోరని అన్నారు. అయితే, కూటమిలో కొనసాగుతూ దాన్ని బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. “ఇండియా కూటమిలో ఐక్యతా శక్తి చాలా ఎక్కువ. ఇది చెక్కుచెదరదు. ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు ఎవరినీ ప్రభావితం చేయవు. ఎవరికైనా బయటకు వెళ్లాలనిపిస్తే, వెళ్ళవచ్చు. కానీ కూటమిని నిలిపివేయాలన్న తలంపుతో ఉండకూడదు,” అని ఆయన స్పష్టం చేశారు.

కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు
ఈ మధ్యాహ్నం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కచ్చితంగా తన సత్తా చాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగా ఉన్నారని తెలిపారు. “ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. కానీ మృతుల జాబితా ఎందుకు వెల్లడించట్లేదు?” “బాధిత కుటుంబాలపై మానవీయతతో కాదు, రాజకీయ ప్రయోజనాలతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.” “ప్రకటనలు వేరు, భూమిపై వాస్తవ పరిస్థితులు వేరు ఆయన స్పష్టం చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కీలక పాత్ర పోషిస్తుందని అఖిలేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: Siddaramaiah : బీజేపీ ఆందోళనపై సిద్ధరామయ్య స్పందన