ఇజ్రాయెల్, ఇరాన్(Israel-Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం టెహ్రాన్(Tehran)లోని ఒక విమానాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) విడుదల చేసింది. ఇజ్రాయెల్ విమానాలను అడ్డగించేందుకే ఈ ఎఫ్-14 జెట్లను అక్కడ ఉంచారని ఐడీఎఫ్ ఆరోపించింది.
డ్రోన్ దాడుల ప్రయత్నం కూడా విఫలం
యుద్ధ విమానాలపై దాడులతో పాటు, ఇజ్రాయెల్‌పైకి డ్రోన్లను ప్రయోగించేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా విఫలం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. నిఘా వర్గాల సమాచారంతో, డ్రోన్ లాంచర్లు, ఆయుధాలను అమరుస్తున్న ఒక బృందాన్ని గుర్తించి, ప్రయోగానికి కొద్ది నిమిషాల ముందే వారిని మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అధికారికంగా విడుదల చేసింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధ భయం
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత ముదిరింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు నెలకొనగా, పలు దేశాలు తమ విమానాశ్రయాలను మూసివేసి, గగనతలాన్ని నిర్బంధించాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ వెంటనే ప్రతీకార చర్యలకెదిగింది.శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్టు సమాచారం.
దీంతో ఇరు దేశాల మధ్య సైనిక దాడుల స్థాయిలో ఉద్రిక్తత పెరిగింది.
Read Also: Modi : ‘మోదీని చంపేయాలి’ అంటూ ఖలిస్థానీల నినాదాలు