हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై టీజీ సర్కార్ కీలక నిర్ణయం

Anusha
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై టీజీ సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇళంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ (Public transport system) మరింత బలోపేతం కానుంది. రెండో దశ (బి)లో మొత్తం 86.1 కిలోమీటర్ల మేర మూడు కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. కారిడార్ 9లో శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్) నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఈ మూడు కారిడార్లు నగర శివారు ప్రాంతాలకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

కేంద్ర ప్రభుత్వం

ఇదివరకు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. అప్పట్లోనే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయనకుఅందజేశారు. అవుటర్ రింగ్ రోడ్, రింగ్ రైల్వే ప్రాజెక్టు, హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ కారిడార్, వంటి ప్రతిపాదనలు మోదీకి అందజేసిన వాటిల్లో ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం నుండి 3,524 కోట్ల రూపాయలను తీసుకోనుంది. కేంద్రం వాటా 18 శాతం. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఎన్డీబీ నుంచి 9,398 కోట్ల రూపాయలను సమీకరించనుంది.

కీలకమైన ముందడుగు

ఆయా బ్యాంకులన్నింటి వాటా 48 శాతంగా ఉంటుంది. ఇక పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కింద 783 కోట్ల రూపాయలను సేకరిస్తుంది. పీపీపీ వాటా నాలుగు శాతంగా నిర్ధారించింది. ఈ మేరకు మెట్రో పాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ (Department of Area and Urban Development) కార్యదర్శి ఇళంబర్తి జీవో జారీ చేశారు.త్వరలోనే ఈ పరిపాలనా అనుమతిని డీపీఆర్‌కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఇది ప్రాజెక్టు అమలులో కీలకమైన ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది.

Hyderabad Metro

రవాణా వ్యవస్థ

పాతబస్తీ మెట్రోకు 2025-26 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించగా అందులో నుంచి మొదటి విడతగా ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులు పాతబస్తీలో మెట్రో మార్గం పనులను వేగవంతం చేయడానికి సహాయపడతాయి. తద్వారా ఈ ప్రాంత ప్రజల మెట్రో కల సాకారం కానుంది. ఈ రెండు ప్రాజెక్టులు హైదరాబాద్ (Hyderabad) నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా, నగర అభివృద్ధికి కూడా దోహదపడనున్నాయి.

ఆమోదం

గత ఏడాది అక్టోబ‌రులో చెన్నై మెట్రో ఫేజ్‌-2కు రూ. 63,246 కోట్లు, 2021 ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్-2కు రూ. 14,788 కోట్లు, 2024 ఆగ‌స్టులో బెంగ‌ళూర్ మెట్రో ఫేజ్-3కి రూ. 15,611 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2 (Hyderabad Metro Phase-2) కు సంబంధించి గత ఏడాది నవంబర్ 4వ తేదీన కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు స‌మ‌ర్పించింది.

Read Also: CM Revanth: కాలేశ్వరం విచారణ కీలక మలుపులతో మంత్రులతో సీఎం రేవంత్ భేటీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870