हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Ace: ‘ఏస్'(అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!

Ramya
Ace: ‘ఏస్'(అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!

తమిళనాడులో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏస్'(Ace). ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదలైంది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించిన ఈ సినిమా జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి మార్కులు సాధించిందో చూద్దాం.

Ace: 'ఏస్'(అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!
Ace Movie

కథా నేపథ్యం

కథానాయకుడు (Vijay Sethupathi) దుబాయ్ సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతాడు. అక్కడి నుంచి అతను మలేషియాకు చేరుకుంటాడు. మలేషియాలో జ్ఞానానందం (యోగిబాబు) చెత్త వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు పంపిస్తానన్న బోల్ట్ కాశీ అనే వ్యక్తి కోసం ఎయిర్‌పోర్టులో జ్ఞానానందం ఎదురుచూస్తూ ఉంటాడు. అక్కడ తారసపడిన కథానాయకుడిని చూసి, అతనే బోల్ట్ కాశీ అనుకుంటాడు. తన రహస్యాలు దాచిన కథానాయకుడు అదే పేరుకు ఫిక్స్ అవుతాడు.

బోల్ట్ కాశీ (Vijay Sethupathi)ని తనకి తెలిసిన ఒక బేకరీలో పనికి పెడతాడు జ్ఞానానందం. ఆ బేకరీని నడుపుతున్న కల్పన (Divya Pillai)ని జ్ఞానానందం ఆరాధిస్తూ ఉంటాడు. జ్ఞానానందం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఉంటున్న బోల్ట్ కాశీకి, అక్కడే రుక్మిణి (Rukmini Vasant) పరిచయమవుతుంది. ఆ పరిచయం అభిమానంగా, ప్రేమగా మారుతుంది. ఆమె చాలా నిజాయితీపరురాలని అతనికీ, అతను చాలా మాస్ అనే విషయం ఆమెకి అర్థమవుతాయి.

రుక్మిణి తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి సవతి తండ్రి రాజదురై (పృథ్వీ) ఆమెను వేధిస్తుంటాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తేనే ఇంట్లో నుంచి వెళతానని పీడిస్తూ ఉంటాడు. అతను పోలీస్ కావడంతో రుక్మిణి మరింత భయపడుతూ ఉంటుంది. ఇక రెండు వారాలలో డబ్బు కట్టకపోతే బేకరీ సీజ్ చేస్తామని బ్యాంక్ వాళ్లు కల్పనకి నోటీసులు ఇస్తారు. వాళ్లను ఆ కష్టాల నుంచి బయటపడేసే డబ్బు కోసం, అక్కడి లోకల్ డాన్ ధర్మా (అవినాశ్)తోనే కాశీ జూదం ఆడతాడు. ధర్మా చేతిలో మోసపోయి రెండు కోట్లు అప్పుపడతాడు. ఇప్పుడు రుక్మిణి, కల్పనతో పాటు, కాశీకి కూడా డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు కోసం కాశీ ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.

విశ్లేషణ

ఈ కథ అంతా మలేషియాలో జరుగుతుంది. పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా మాదిరిగా కనిపించినప్పటికీ, కేవలం ఆరు పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. విజయ్ సేతుపతితో రొమాంటిక్ కామెడీ వర్కవుట్ అయిందా? అనేది అందరిలో తలెత్తే మొదటి సందేహం. అయితే యోగిబాబు వైపు నుంచి కొంత కామెడీ వర్కౌట్ అయిందిగానీ, విజయ్ సేతుపతి వైపు నుంచి రొమాన్స్ అనేది ఎక్కడా కనిపించదనే చెప్పాలి.

ఈ కథలో హీరో బృందంలోని వాళ్లకు డబ్బు చాలా అవసరమవుతుంది. అందుకు గల కారణాలు కరెక్టుగానే అనిపిస్తాయి. కానీ ఆ డబ్బు కోసం హీరో చేసే పనులే సహజత్వానికి చాలా దూరంగా, సిల్లీగా కనిపిస్తాయి. హీరోయిన్ సవతి తండ్రి ట్రాక్, హీరో-విలన్ ట్రాక్ ఏ మాత్రం కొత్తదనం లేకుండా కొనసాగుతాయి. యాక్షన్ సన్నివేశాలు ఓకేగా అనిపిస్తాయి గానీ, ఎమోషన్స్ మాత్రం కనెక్ట్ కావు. ఇక కథ అంతా మలేషియాలోని స్లమ్ ఏరియాలో, గందరగోళంలో సాగడం మరో ఎత్తు.

కథ మొదలైన దగ్గర నుంచి కూడా పెద్దగా బలం లేని సన్నివేశాలే తెరపై కదులుతూ ఉంటాయి. యోగిబాబు తన మార్క్ తో ఆ సన్నివేశాల మధ్యలో దారిచేస్తూ మనలను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాడు. క్లైమాక్స్ చేరుకునేవరకూ కథలో పెద్దగా కదలిక కనిపించదు. తక్కువ పాత్రల చుట్టూ కథను అల్లిన తీరు గొప్పగా అనిపించినప్పటికీ, ఆ కథలో ఆశించిన స్థాయి బలం లేకపోవడం ప్రేక్షకులకు కాస్త నిరాశను కలిగిస్తుంది.

నటీనటుల పనితీరు

విజయ్ సేతుపతిలోని నటుడిని కొత్తగా చూపించే ప్రయత్నమేమీ జరగలేదు. అయినా ఎప్పటిలానే ఆయన నటన ఆకట్టుకుంటుంది. రుక్మిణి వసంత్ ఆకర్షణీయమైన రూపం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి. మోడ్రన్ డ్రెస్సులలో ఆమె గ్లామరస్‌గా మెరిసినప్పటికీ, చీరకట్టులోనే ఆమెకు ఎక్కువ మార్కులు ఇవ్వగలమని అనిపిస్తుంది. యోగి బాబు స్టైల్, దివ్య పిళ్లై లుక్ కూడా సినిమాకి కొంతవరకూ హెల్ప్ అయ్యాయి.

సాంకేతిక వర్గం

ఆర్ముగ కుమార్ కథ, స్క్రీన్ ప్లే ఓ మాదిరిగా అనిపిస్తాయి. సాంగ్స్ పరంగా మలేషియాలోని గొప్ప లొకేషన్స్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. కరణ్ బి రావత్ ఫొటోగ్రఫీ, సామ్ సిఎస్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఫెన్నీ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సాగతీతను ట్రిమ్ చేస్తే బాగుండుననే భావన కలుగుతుంది.

ముగింపు

మలేషియాలో చాలా తక్కువ పాత్రల చుట్టూ అల్లిన కథ ఇది. యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాన్స్ దిశగా పూర్తిస్థాయి కసరత్తు జరగలేదు. అందువల్లనే బలం తగ్గిన సన్నివేశాలు తేలిపోతుంటాయి. కామెడీ పేరుతో అప్పటికప్పుడు తెరపై జరిగే ఒక హడావిడి తప్ప, మరెలాంటి ఫీల్ ను కలిగించలేకపోయిన కథ ఇది.

Read also: Blind Spot: ‘బ్లైండ్ స్పాట్’ మూవీ రివ్యూ! (అమెజాన్ ప్రైమ్) లో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

‘కుట్రమ్ పురింధవన్: ది గిల్టీ వన్’ (సోనీ లివ్) సిరీస్ రివ్యూ

రూ.51 కోట్ల దాటిన కలెక్షన్స్.. ‘మా’ లైఫ్‌టైమ్‌ను మించి!…

రూ.51 కోట్ల దాటిన కలెక్షన్స్.. ‘మా’ లైఫ్‌టైమ్‌ను మించి!…

‘ది పెట్ డిటెక్టీవ్’ (జీ 5) మూవీ రివ్యూ

‘ది పెట్ డిటెక్టీవ్’ (జీ 5) మూవీ రివ్యూ

‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ మూవీ రివ్యూ

‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ మూవీ రివ్యూ

Tere Ishk Mein మూవీ రివ్యూ 2025 హిట్ లేదా ఫ్లాప్? బాక్స్ ఆఫీస్ కలెక్షన్, కథ వివరాలు…

Tere Ishk Mein మూవీ రివ్యూ 2025 హిట్ లేదా ఫ్లాప్? బాక్స్ ఆఫీస్ కలెక్షన్, కథ వివరాలు…

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

‘జిద్దీ ఇష్క్ ‘ సిరీస్ రివ్యూ!

‘జిద్దీ ఇష్క్ ‘ సిరీస్ రివ్యూ!

ఫ్యామిలీ మ్యాన్ కొత్త అధ్యాయం

ఫ్యామిలీ మ్యాన్ కొత్త అధ్యాయం

‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్.. ఎంతో తెలుసా ?

రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్.. ఎంతో తెలుసా ?

క్లైమాక్స్‌తో నిలిచిపోయిన గ్రామీణ ప్రేమకథ…

క్లైమాక్స్‌తో నిలిచిపోయిన గ్రామీణ ప్రేమకథ…

రితేష్–వివేక్–ఆఫ్తాబ్ త్రయం మళ్లీ పన్‌లతో నిండిన పాగల్ కామెడీకి రెడీ!

రితేష్–వివేక్–ఆఫ్తాబ్ త్రయం మళ్లీ పన్‌లతో నిండిన పాగల్ కామెడీకి రెడీ!

📢 For Advertisement Booking: 98481 12870