అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)ను హతమార్చేందుకు ఇరాన్(Iran) ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ(Netanyahu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అణుకార్యక్రమాలకు ట్రంప్‌ను అతిపెద్ద ముప్పగా ఇరాన్ ఇస్లామిక్ పాలనా యంత్రాంగం భావిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. ‘ఇరాన్‌లోని ఇస్లామిక్ పాలక వ్యవస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ అణు కార్యక్రమానికి పెద్ద ముప్పుగా భావించి, ఆయనను హతమార్చేందుకు ప్రయత్నించింది.. “వాళ్లు అయనను (ట్రంప్) చంపాలని అనుకుంటున్నారు. ఆయన వారికీ ప్రధాన శత్రువు’ అని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని చంపడానికి ఇజ్రాయేల్ చేసిన ప్లాన్‌ను ట్రంప్ అడ్డుకున్నారనే వార్తల వేళ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ట్రంప్ శక్తివంతమైన నేత: నెతన్యాహూ
ట్రంప్ ఒక శక్తివంతమైన నాయకుడు. మిగతావారు అనుసరించిన బలహీనమైన మార్గాన్ని ఆయన తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ డబ్బు ఆశచూపినా ఆయన దృఢంగా వ్యవహరించారు. ఆ నకిలీ ఒప్పందాన్ని తెంచిపారేశారు. ఖాసీం సూలేమానీని హతమార్చాడు. అణ్వాయుధాలు ఉండకూడదు అంటే, యురేనియం శుద్ధి కూడా చేయరాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.. ఆయన శక్తివంతమైన నేత. అందుకే ఆయన వారికీ నంబర్ వన్ శత్రువు’ అని ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు.
ఇజ్రాయెల్ తీవ్రమైన అణు ముప్పు
ఇరాన్ క్షిపణి తన ఇంటి బెడ్‌రూమ్ కిటికిని తాకిన ఘటనను ప్రస్తావిస్తూ.. తనను కూడా టార్గెట్ చేసినట్లు ఆరోపించారు. ‘ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యాన్ని నిరోధించడంలో ట్రంప్‌నకు నేను జూనియర్ పార్ట్నర్’ అని వ్యాఖ్యానించారు.
‘మేము రెండు ముప్పులను ఎదుర్కొంటున్నాం.. మొదటిది యురేనియాన్ని శుద్ధి చేసి అణుబాంబులుగా మార్చే ప్రక్రియను ఇరాన్ వేగవంతం చేయడం.. రెండోది వారు బాలిస్టిక్ క్షిపణుల నిల్వను గణనీయంగా పెంచడం.. ఏడాదికి 3,600 క్షిపణులు. మూడేళ్లల్లో 10,000 బాలిస్టిక్ క్షిపణులు, ఒక్కొక్కటి ఒక టన్ను బరువు, మాక్ 6 వేగంతో మా నగరాలపై దాడి చేయగలవు… 26 ఏళ్లల్లో ఇది 20,000కు చేరుతుంది.
ఇజ్రాయెల్ ప్రపంచాన్ని రక్షిస్తుంది
ఇజ్రాయేల్ వైఖరిని నెతన్యాహూ పునరుద్ఘాటిస్తూ.. ‘ఇజ్రాయెల్ తనను తాను మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా రక్షిస్తుంది’ అని చెప్పారు. మరోవైపు, ఈ దాడులకు ప్రతిస్పందనగా బాలిస్టిక్ క్షిపణులతో పెద్ద స్థాయిలో ఇజ్రాయేల్ నగరాలపై ఇరాన్ దాడి చేసినప్పటికీ, చాలా క్షిపణులను అడ్డుకున్నట్లు సమాచారం. ఇజ్రాయేల్ చేపట్టిన చర్యలు ఇరాన్ అణు ప్రణాళికను గణనీయంగా వెనక్కి నెట్టాయని, ఇంకా ఇరాన్ వంటి ఉగ్రవాదాన్ని మద్దతిచేసే పాలక వ్యవస్థతో చర్చలు జరపబోమని నెతన్యాహూ స్పష్టం చేశారు.
Read Also: Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్ జనరల్