ఇజ్రాయిల్‌పై ప్రతీకార దాడికి దిగింది ఇరాన్. సుమారు వంద డ్రోన్లతో ఇరాన్(Iran Drones) అటాక్ చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఆ దాడులను తిప్పికొట్టేందుకు సన్నద్దం అయినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఆకస్మిక దాడికి పాల్పడింది. అణ్వాయుధ కేంద్రాలు, అణు శాస్త్రవేత్తలను, సీనియర్ మిలిటరీ వ్యక్తులను ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. అయితే తమ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. అణ్వాయుధులను ఇరాన్ డెవలప్ చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది.
ఇరాన్‌పై జరిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు
ఇజ్రాయిల్ వైమానిక దళానికి(Israel Air Force) చెందిన యుద్ధ విమానాల వీడియోను ఐడీఎఫ్ రిలీజ్ చేసింది. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో సుమారు 200 ఐఏఎఫ్ విమానాలు పాల్గొన్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ చెప్పింది. ఆ ఫైటర్ విమానాలు సుమారు 330 బాంబులను జార విడిచాయి. సుమారు వంద ప్రదేశాల్లో వాటిని పేల్చినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఇజ్రాయిల్ విమానాలకు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయిల్‌కు చేరుకునేందుకు కొన్ని గంటల సమయం పట్టనున్నది.
అంతర్జాతీయంగా ఆందోళన
యుద్ధానికి దారితీయకూడదన్న విశ్వదేశాల ఆశ
ఈ దాడులతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది. ఇది పరిసర ప్రాంతాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, ఇరువైపులా సంయమనం పాటించాలని కోరుతోంది. ఈ పరిణామాలపై అమెరికా తక్షణమే స్పందించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన చేస్తూ, “ఈ దాడుల్లో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదు. ఇది పూర్తిగా ఇజ్రాయెల్ తీసుకున్న చర్య,” అని తెలిపారు. తమ దృష్టి ప్రధానంగా అక్కడ ఉన్న అమెరికన్ దళాల భద్రతపైనే ఉందని పేర్కొన్నారు.
Read Also: Natanz Nuclear Site: నటాంజ్ అణుశుద్దికరణ కేంద్రంపై ఇజ్రాయిల్ అటాక్