భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఓ కీలక అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనుంది.ఐపీఎల్(IPL) ముగిసిన తర్వాత జరుగుతున్న ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. ముఖ్యంగా లీగ్‌ను గెలిచిన జట్లు విజయోత్సవ ర్యాలీలు,కొత్త నియమ నిబంధనలపై ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం.భారత క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.ఇండియన్ క్రికెట్ బాగు కోసం చేయాల్సిన మార్పుచేర్పుల విషయంలో బోర్డు ఎప్పుడూ వెనుకాడదు. ఇది గతంలో ఎన్నోసార్లు చూశాం. సరికొత్త నిబంధనలు తీసుకొస్తూ సమస్యలకు చెక్ పెడుతూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా మరోసారి నయా రూల్స్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలను
జూన్ 4న నిర్వహించిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ(IPL franchise)లు నిర్వహించే వేడుకల విషయంలో కొత్త నియమ, నిబంధనలను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోందట బీసీసీఐ.ఈ మీటింగ్‌ను వర్చువల్‌గా నిర్వహించనున్నట్టు సమాచారం.ఇకపోతే,తొక్కిసలాట ఘటనలో అరస్టైన ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలె(Nikhil Sosale)కు కర్నాటక హైకోర్టు గురువారం బెయిల్ మంజూరుచేసింది. జూన్ 6న కర్నాటక పోలీసులు నిఖిల్‌తో పాటు డీఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.
Read Also: Finn Allen : మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో 19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు!