గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లేందుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా(Air India) విమానం (బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జనావాసాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదం మేఘనినగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వేగంగా టేకాఫ్ అయిన విమానం కొన్ని నిమిషాల్లోనే తన మార్గాన్ని తప్పి బీజే మెడికల్ కాలేజ్ భవనంపై పడిపోయిందని అధికారులు తెలిపారు.

అధికారులు
దీంతో కాలేజ్ భవనంతోపాటు మరో ఇతర భవనంలో కూడా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో 20 మందికి పైగా మెడికోలు చనిపోయినట్టు సమాచారం.దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌పై విమానం కూలిందని,రెండు భారీ భవనాల్లో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. విమానం కూలడంతో భవనాలు నేలమట్టమయ్యాయి.ఎయిర్ ఎండియా విమానంలో 242 మంది ఉన్నారు. 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani)కూడా, ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి 1.38PMకి లండన్ కు బయలుదేరిన AI171 విమానం వెంటనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. బోయింగ్ 787-8 విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్, 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు.
Read Also: Kamal Kaur Bhabhi: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అనుమానాస్పద మృతి