హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దక్షిణాది సినీ పరిశ్రమలో గత 20 ఏళ్లుగా తనదైన శైలితో, ప్రత్యేక గుర్తింపుతో ప్రేక్షకుల మనసు దోచుకుంటోన్న నటి త్రిష.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషల్లో నటించి, అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసిన త్రిష, తనదైన సొగసుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1999లో జోడి చిత్రంలో చిన్న పాత్రతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన త్రిష(Trisha), ఆ తర్వాత నీ మనసు నాకు తెలుసు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో విపరీతంగా అవకాశాలు వచ్చాయి.ఈ సినిమా విజయంతో త్రిష క్రేజ్ అంతు లేకుండా పెరిగింది. తెలుగు చిత్రసీమతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి.
ప్రధాన పాత్ర
త్రిష కెరీర్‌ను పరిశీలిస్తే,కథానాయికగా తెరపై తన ప్రత్యేకతను చాటుకుంది. కమర్షియల్ సినిమాల్లో మాత్రమే కాకుండా క్లాస్ చిత్రాల్లోనూ సజావుగా నటించగల సత్తా ఉన్న నటి ఆమె. ఆమె ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ‘కోడి’, ‘96’, ‘గిలీ’, ‘తిరుపాచి’, ‘కురువి’, ‘లియో’ వంటి ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.ఈ ఏడాది వరుసగా హ్యాట్రిక్ హిట్టు కొట్టిన త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళంలో మరిన్ని చిత్రాల్లో కనిపించనుంది. ఇదిలా ఉంటే గతంలో త్రిషకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో విజయ్ దళపతి ఫోటోను చూపిస్తూ పలు ప్రశ్నలు అడిగారు యాంకర్. దీంతో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

చర్చనీయాంశంగా
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ గురించి అందరికీ తెలుసు. అతడి నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలిచాడు. అయితే, విజయ్ వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో చాలా మంది ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష విజయ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “విజయ్ ఓ చాలా డిఫరెంట్ పర్సనాలిటీ. షూటింగ్ సమయంలో అతడు చాలా నిశ్శబ్దంగా, శాంతంగా ఉంటాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా తన పనిని చేసుకుంటూ వెళ్తాడు. అందుకే షూటింగ్ స్పాట్‌లో అందరు అతడిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు,” అంటూ త్రిష చెప్పుకొచ్చింది.

కొత్త విషయాన్ని
తన సహనటుడిపై ఈ విధంగా స్పందించిన త్రిష, “విజయ్ ఒక పర్ఫెక్షనిస్ట్. సినిమా కోసం ఎంత కష్టపడాలో అతడి నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో నిశితంగా అర్థం చేసుకుని, అందులో లీనమైపోతాడు. అతడిని నేను ప్రతీసారి చూస్తే కొత్తగా అనిపిస్తాడు. అని పేర్కొంది.అతడి నుంచి నేను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. అతడి డెడికేషన్ చూసి మాకు కూడా ఇన్‌స్పిరేషన్ వస్తుంది,” అని ఆమె పేర్కొంది.తమిళ చిత్రసీమలో విజయ్ పేరు చెప్పగానే అందరూ గుర్తు పెట్టుకునే విషయం అతడి వినయశీలత. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా వినయంగా ఉంటాడని అంటారు. షూటింగ్ స్పాట్‌లోనూ, బయటా విజయ్ ఎప్పుడూ తక్కువగా మాట్లాడతాడు. కానీ పని విషయంలో మాత్రం అత్యంత శ్రద్ధ చూపిస్తాడు. తన పాత్రకు న్యాయం చేయడమే కాకుండా, సహనటీనటులకు సపోర్ట్ చేసే విధానంలోనూ అతడు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటాడు.

మంచి స్పందన
ఇకపోతే,విజయ్, త్రిష జంట గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ‘గిల్లీ’ చిత్రం ఈ జంటకు సూపర్ హిట్ అనిపించగా, ఆ సినిమా విజయ్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ‘తిరుపాచి’, ‘ఆది’, ‘కురువి’ వంటి సినిమాల్లో కూడా ఇద్దరూ కలిసి నటించారు. ఒక్కో చిత్రంలో వారి కెమిస్ట్రీ అలరిస్తూ ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు పొందింది. ఇటీవల ‘లియో’ సినిమాతో తిరిగి ఈ జంట కలిసి నటించగా, దానికీ మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం త్రిష వయసు 41 ఏళ్లు అయినా కూడా ఆమె అందం, అభినయం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చేతినిండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. యువ హీరోయిన్లకు గట్టి పోటీగా నిలుస్తూ, ఆమెకే ప్రత్యేకంగా రాసిన పాత్రల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వయస్సు కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్నట్టుగా త్రిష ప్రూవ్ చేస్తోంది.

Read Also: Kalpika Ganesh: నటి కల్పిక గణేశ్‌పై కేసు నమోదు.. కారణం ఏంటంటే?