తెలంగాణ బస్ పాస్ ధరల పెంపు నిర్ణయంపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై స్పందించారు.ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.“బస్ పాస్ ఛార్జీలను తక్కువ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి” అని(Ponnam Prabhakar) మంత్రి పేర్కొన్నారు.ఆర్టీసీకి టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తే తాము కూడా పెంచిన బస్ పాస్ ధరలను తగ్గిస్తామని పొన్నం తెలిపారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే తాము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అలానే గత మూడేళ్లుగా విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచలేదని ఆయన తెలిపారు. ఇక మహిళల కోసం ఉచిత బస్ స్కీమ్‌ను అమలు చేసిన తర్వాత తమ ప్రభుత్వం ఆర్టీసీకి 6 వేల కోట్ల రూపాయలు చెల్లించిందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
సామాన్యుల బస్ పాస్
విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలతో పాటుగా సామాన్యుల బస్‌పాస్ ధరలను కూడా పెంచిది. కాకపోతే విద్యార్థులకు ఒక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు స్టూడెంట్ పాస్‌తో ఆర్డినరీ మాత్రమే కాక మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు(Metro Express Bus)ల్లోనూ ఎక్కవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ సామాన్యుల బస్ పాస్ ధరలపై 20 శాతం పెంచింది. దీంతో గతంలో ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1150 ఉండగా పెంచిన తర్వాత దాని రేటు రూ.1400గా మారింది. అలానే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ప్రస్తుత ధర రూ.1600కు చేరింది. పెంచడానికి ముందు ఇది 1300 రూపాయలుగా ఉండేది. అలానే మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర గతంలో రూ.1450 గా ఉండేది. 20 శాతం పెంపు తర్వాత దీని ప్రస్తుత ధర రూ.1800కు చేరింది.

గ్రేటర్ పరిధిలో
హైదరాబాద్‌లోని విద్యార్థులకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త బస్ పాస్(Bus pass)ల జారీ చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 40 ఆర్టీసీ కేంద్రాల్లో స్టూడెంట్స్ బస్ పాస్‌లు తీసుకోవచ్చని తెలిపింది. కొత్త బస్ పాస్‌ల కోసం విద్యార్థులు ముందుగా www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Read Also: Rain: తెలంగాణలో 3 రోజులు భారీ వర్ష సూచన