మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL) టీ20 టోర్నీలో ఒక అరుదైన, ఆశ్చర్యకర రనౌట్ ఘటన క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించింది. పునేరి బప్పా, రాయిగడ్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. పునేరి జట్టు కీపర్ సూరజ్ షిండే(Suraj Shinde) అద్భుతమైన త్రో చేశాడు.అయితే ఆ బంతి రెండు వైపుల ఉన్న వికెట్లను తాకింది. స్ట్రయికర్‌తో పాటు నాన్ స్ట్రయికర్ ఎండ్‌లోనూ బంతి వికెట్లను కూల్చింది. ఈ యాక్షన్‌లో నాన్ స్ట్రయిక్ బ్యాటర్ స్టన్నింగ్ రీతిలో రనౌట్ అయ్యాడు. ఈ సంఘటన రెండో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే చోటుచేసుకున్నది.
నాన్ స్ట్రయికర్
మొదట బ్యాటింగ్ చేసిన పునేరీ జట్టు 202 రన్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయిగడ్ జట్టుకు తొలి ఓవర్‌లోనే ఝలక్ తగిలింది. స్ట్రయికర్ బ్యాటర్ సిద్దేశ్ వీర్(Siddesh Veer) బంతిని ఆన్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే ఆ బంతిని అందుకున్న కీపర్ స్ట్రయికర్ దిశగా విసిరాడు. ఆ బంతి వికెట్లను తాకుతూ నాన్ స్ట్రయికర్ దిశగా వెళ్లింది. అయితే బంతి వికెట్లను తాకేలోగా స్ట్రయికర్ క్రీజ్‌లోకి వచ్చేశాడు. ఇక నాన్ స్ట్రయికర్ మాత్రం క్రీజ్‌లో అడుగుపెట్టలేకపోయాడు. ఫస్ట్ స్ట్రయికర్ వద్ద స్టంప్స్‌ను కూల్చి ఆ తర్వాత నాన్‌స్ట్రయికర్ వద్ద కూడా స్టంప్స్‌ను పడేయడంతో అనూహ్య రీతిలో నాన్ స్ట్రయికర్ రనౌట్ అయ్యాడు. దురదృష్టవశాత్తు ఓపెనింగ్ బ్యాటర్ హర్ష్ మోగవీర(Harsh Mogaveera) ఔట్ అయ్యాడు. ఆ ఔట్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
టీ20 క్రికెట్
క్రికెట్‌లో ఇలా బంతి రెండు వైపుల ఉన్న వికెట్లకు తగిలి ఔటైన ఘటన చోటుచేసుకోవడం చాలా అరుదు. ఈ మ్యాచ్‌లో పునేరీ జట్టు(Puneri team) 99 రన్స్ తేడాతో నెగ్గింది. రనౌట్ చేసిన షిండే ఈ మ్యాచ్‌లో 12 బంతుల్లోనే 40 రన్స్ స్కోర్ చేశాడు. అయితే గతంలోనూ టీ20 క్రికెట్‌లో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకున్నది. 2022లో జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆండ్రూ రస్సెల్ ఇలాగే ఔటయ్యాడు.
Read Also: Deepika Padukone: తండ్రి ప్రోత్సహంతో.. బ్యాడ్మింటన్ స్కూల్ ప్రారంభించిన దీపికా