అమెరికా(America)లో మరో చైనా పరిశోధకుడి(Chinese Researcher)ని అరెస్టు చేశారు. వుహాన్ ల్యాబ్‌లో పనిచేసే ఆ పరిశోధకురాలు.. బయోలాజికల్ మెటీరియల్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోది. పీహెచ్డీ విద్యార్థి చెంగ్‌జాన్ హన్ను డెట్రాయిట్లో ఎఫ్‌బీఐ (FBI)అధికారులు పట్టుకున్నారు. నాలుగు రకాల జీవ పరికరాలను ఆమె పార్సిల్ చేసినట్లు తెలుస్తోంది. బయోలాజికల్ మెటీరియల్స్ తీసుకున్న ఆ వ్యక్తి అబద్దాలు చెబుతున్నట్లు ఎఫ్‌బీఐ చీఫ్ కాశ్ పటేల్ తన పోస్టులో తెలిపారు. ఇటీవల చైనా(China) పరిశోధకులపై స్మగ్లింగ్ కేసు బుక్ అయిన మూడో వ్యక్తి ఆమె. జూన్ 4వ తేదీన ఓ చైనీస్ జంటను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రమాదకర బయోలాజికల్ ప్యాథోజన్‌ను వాళ్లు స్మగ్లింగ్ చేశారు. ఆగ్రో టెర్రర్ వెపన్‌గా దాన్ని వాడే అవకాశాలు ఉన్నాయి.

పోలీసులకు తప్పుడు స్టేట్మెంట్
వుహాన్ నుంచే కోవిడ్ వైరస్ వ్యాప్తి అయిన విషయం తెలిసిందే. అమెరికాలోని మిచిగన్ వర్సిటీలో పనిచేస్తున్న నలుగురికి చైనా పరిశోధకురాలు నాలుగు పార్సిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ఆ పార్సిల్స్ గురించి మొదట్లో పోలీసులకు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఎఫ్‌బీఐ, కస్టమ్స్ అధికారుల ముందు ఆమె తన నేరాన్ని ఒప్పుకున్నది. ఆ పార్సిల్స్‌లో నులి పురుగుల్లాంటి పురుగులు ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించడానికి ఒక రోజు ముందు ఆమె తన ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి డేటాను తొలగించినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ పేర్కొన్నారు.
జూన్ 4వ తేదీన ఇద్దరు చైనీయులు ఫుసేరియం గ్రామినేరియం ఫంగస్‌ను స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ఆ ఫంగస్‌ను పంటల నాశనం కోసం వాడే ఛాన్సు ఉన్నది. ఒకే వారంలో రెండు స్మగ్లింగ్ ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఎఫ్‌బీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ వైఖరిని ఖండించింది.
ఎఫ్‌బీఐ స్పందన – చైనా చర్యలపై గంభీర అనుమానాలు
వరుసగా ఘటనలు – ఉద్దేశపూర్వక స్మగ్లింగ్‌కు సంకేతమా?
ఒకే వారం వ్యవధిలో చైనా పరిశోధకులపై రెండు స్మగ్లింగ్ కేసులు నమోదవడం వల్ల, ఇది ఉద్దేశపూర్వక చర్యగా ఉండొచ్చని ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ వైఖరిపై గంభీర విమర్శలు వెలువడుతున్నాయి. జూన్ 4న మరో చైనీస్ జంట ప్రమాదకరమైన ఫుసేరియం గ్రామినేరియం ఫంగస్‌ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. ఈ ఫంగస్ పంటలను నాశనం చేసే లక్షణాలతో ఉండటంతో ఇది ఆగ్రో టెర్రర్ వెపన్‌గా వాడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Also: Los Angeles: ఆందోళనకారులపై యూఎస్ మెరైన్స్ మోహరింపు