తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మహానాడు సమావేశాల తర్వాత కేవలం పది రోజుల్లోనే పార్టీకి ఒక సీనియర్ నేత,సుగవాసి బాలసుబ్రమణ్యం(Sugavasi Balasubramanyam)రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజంపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు.’ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆర్యా, ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను’ అంటూ లేఖలో పేర్కొన్నారు.
స్వతంత్ర అభ్యర్థి
మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం. పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ వారసుడిగా బాలసుబ్రమణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రమణ్యం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు.

నియోజకవర్గంలో
టీడీపీలో కొంతకాలంగా గ్రూప్‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడూ పార్టీ నేతలు మూడు గ్రూపులోగా విడిపోయారనే టాక్ ఉంది. రాజంపేట పార్లమెంట్(Rajampet Parliament) పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు,సుగవాసి బాలసుబ్రమణ్యం కీలకంగా ఉన్నారు.దీంతో పార్టీ కేడర్ కొంత గందరగోళంలో ఉంది. నియోజకవర్గంలో ముగ్గురు నేతలు ఉండటంతో ఎవరివైపు నడవాలో అర్థంకాని పరిస్థితి. ఈ క్రమంలో సుగవాసి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే టాక్ వచ్చిందట.
Read Also: CM Chandrababu: నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు భేటీ