हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Madan Lal: ఆ హడావుడే కొంప ముంచిందన్న మదన్ లాల్

Anusha
Madan Lal: ఆ హడావుడే కొంప ముంచిందన్న మదన్ లాల్

బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మదన్ లాల్(Madan Lal) స్పందించారు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యుడైన మదన్ లాల్, ఆర్సీబీ యాజమాన్యం సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా కార్యక్రమం నిర్వహించడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు.”మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లో సంబరాలు చేసుకున్నారు. మరుసటి రోజే బెంగళూరులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముంది? సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే అనవసరంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు” అని మదన్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

 Madan Lal: ఆ హడావుడే   కొంప ముంచిందన్న మదన్ లాల్
Madan Lal: ఆ హడావుడే కొంప ముంచిందన్న మదన్ లాల్

విజయోత్సవాలను

ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందిస్తూ, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ విజయోత్సవాలను నిర్వహించాయని తెలిపారు. బెంగళూరు జట్టు కావడం వల్లే తాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని ఆయన విలేకరులతో అన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read Also: Yograj Singh: శ్రేయస్ అయ్యర్ ఓ క్రిమినల్ అంటూ మండిపడ్డ యోగ్‌‌రాజ్ సింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870