పాఠశాలలు మొదలయ్యే సమయం దగ్గరపడుతోంది, కొత్త సంవత్సరం, కొత్త క్లాస్, కొత్త టీచర్లు అన్నదీ పిల్లల్లో ఒకింత ఉత్సాహానికీ, ఒకింత భయానికీ కారణమవుతుంది. ముఖ్యంగా కొందరికి ప్రత్యేకంగా ఓ సబ్జెక్ట్ అంటేనే భయమేస్తుంది. గణితం, సైన్స్ వంటి సబ్జెక్ట్స్ ముందే కళ్లముందు ఊహించుకుని పాఠశాలకు వెళ్లాలంటే భయం కలుగుతుంది.ప్రస్తుతం సెలవుల సమయం, ఇదే సరైన టైం మన బలహీనత(Weakness)లు తెలుసుకొని, వాటిపై క్రమంగా కృషి చేయడానికి. ఉదాహరణకు మీకు గణితం మీద భయం ఉంటే, చిన్న క్లాసుల సిలబస్‌ను తిరిగి చదవండి. చిన్న చిన్న ప్రాబ్లెమ్స్ ప్రాక్టీస్ చేయండి. వీడియోలు చూడండి. అలాగే, మీకు నచ్చిన సబ్జెక్ట్‌పై మరింత ఆసక్తిగా ప్రాజెక్టులు, కథలు, ప్రాక్టికల్ అంశాలు చూసేందుకు ప్రయత్నించండి. అది మీలో జిజ్ఞాసను పెంచుతుంది.
మార్షల్ ఆర్ట్స్
ఇప్పటికే క్లాసులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతున్నందున, విద్యతో పాటు మీలోని ప్రతిభను వెలికితీసే ఏదైనా ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీని ఎంచుకోవడం ఎంతో అవసరం.మీకు నచ్చిన హాబీని ఎంచుకోవడం కూడా మంచి మార్గం! చిన్న చిన్న కవితలు, కథలు రాయడం, ఫొటోల సేకరణ వంటివి చేయండి.సామాజిక సేవా కార్యక్రమాల్లో(social service activities) పాల్గొనడం, వాలంటీర్లుగా పని చేయడం ఇష్టం అయితే అమ్మానాన్నలు, టీచర్లకు ఆ విషయం చెప్పి ముందుకు వెళ్లండి.స్పెల్లింగ్స్, ఒలింపియాడ్స్, శ్లోకాల పోటీలు వంటి వాటికి సిద్ధం కాగలరేమో చూడండి.యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటివి ఆసక్తి ఉందేమో చెక్ చేసుకోవడం ఉత్తమం.

ఒకసారి బేసిక్స్‌ను
కొన్ని పాఠశాలల్లో కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీ ఇలా కొన్ని అంశాలతో స్టూడెంట్ టీమ్స్‌గా పని చేస్తుంటారు. మీకు వీలు కుదిరితే అందులో జాయిన్ అవ్వండి.వీటన్నింటిలో మీకు ఆసక్తి ఉన్న అంశాలు ఏం ఉన్నాయో చూసి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా ఈ ఇయర్ ఒక మంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ(Extracurricular activity) చేయడానికి సిద్ధం అవ్వండి, సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఏదైనా సరే డౌట్ ఉంది అనుకున్నప్పుడు ప్రస్తుతం ఒకసారి బేసిక్స్‌ను రివిజన్ చేయొచ్చు. దీనివల్ల కొంత బెటర్ అవుతాం.అలాగే ఇప్పటికే మనం పుస్తకాలు కూడా తీసుకుని ఉంటాం. వాటిలో ఉన్న ఆ సబ్జెక్ట్ లెసన్స్ ఒక్కొక్కటిగా చదవడానికి ప్రయత్నం చేస్తే కొంత అలవాటు అవుతుంది.క్లాసులు ప్రారంభమయ్యాక కూడా ఇలాగే సొంతంగా చదివి, డౌట్స్ అడగడం ద్వారా నెమ్మదిగా గ్రిప్ సంపాదించగలం.
Read Also: Telangana Cabinet: కీలక అంశాలపై నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం