భయానికి కొత్త నిర్వచనం: ‘అంట్రమ్’
హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా మందికి ఇష్టమైనప్పటికీ, ఒంటరిగా వీటిని చూడాలంటే మాత్రం చాలామంది భయపడుతుంటారు. కొంతమందికి ఇది ఫన్ అయినా, మరికొందరికి ఇది నిజంగా భయంకరమైన అనుభవంగా మారుతుంది.
అయితే ఇటీవల కాలంలో ఓ సినిమా పేరు వినిపిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
అంట్రమ్: ది డెడ్లీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అనే ఈ కెనడియన్ హారర్ మూవీ గురించి ఓ షాకింగ్ వార్త హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాను చూసిన ఆడియెన్స్‌లో దాదాపు 86 మంది చనిపోయారట! అవును, మీరు చదువుతున్నది నిజమే. ఇదే ఈ సినిమాకు దక్కిన క్రేజీ హైపుకి కారణం కూడా.
ఇంతగా ఈ సినిమా ఎందుకు పాపులర్ అయిందంటే, దాని కథలోని భయానకత, విజువల్స్, ఆడియో ఎఫెక్ట్స్ అన్నీ కలసి ఒక మానసిక రోమాంచాన్ని కలిగిస్తాయి. డైరెక్టర్లు డేవిడ్ అమిటో, మైఖేల్ లైసినీ ఈ సినిమాను 2018లో రెండు భాగాలుగా రూపొందించారు.
వాస్తవానికి ఇది ప్యూర్ ఫిక్షనల్ కాన్సెప్ట్‌తో కూడిన సినిమా అయినప్పటికీ, దీనిని చుట్టుముట్టిన ప్రచారం, అనుభవాలు మాత్రం వాస్తవమేనని భావించేలా ఉన్నాయి. సినిమా ప్రారంభంలోనే ‘ఈ సినిమాను చూడటం వల్ల ప్రాణహాని జరుగవచ్చని’ ఓ హెచ్చరిక వస్తుంది.
అంతేకాదు, కొన్ని థియేటర్లలో ఈ సినిమాను స్క్రీన్ చేసే ముందు ఓ లీగల్ డిస్క్లెయిమర్ కూడా చూపించారు. దీని వల్ల ప్రేక్షకుల్లో భయం పెరిగిపోవడం సహజమే.

నరకానికి దారి తీసిన పిల్లల కథ!
సినిమా కథ విషయానికి వస్తే.. మాక్సిన్ అనే మహిళకి ఒరలీ అనే కూతురు, నాథన్ అనే కొడుకు ఉంటారు. ఒక రోజు వీళ్ల పెట్ డాగ్ చనిపోతుంది.
దీంతో నాథన్ తీవ్ర దుఃఖంలో ఉంటాడు. చనిపోయిన కుక్క స్వర్గానికి వెళ్లలేదని, నరకానికి వెళ్లిందని నాథన్ తో అతని తల్లి ఆటపట్టించడానికి చెబుతుంది. దీంతో నాథన్ నొచ్చుకుంటాడు.
దీంతో తన సోదరుడిని బుజ్జగించేందుకు ఒరలీ తన తమ్ముడిని అడవిలోని ‘Antrum’ అనే ప్రాంతానికి తీసుకెళుతుంది.
అక్కడ పెంపుడు కుక్క ఆత్మకు శాంతి కలగజేసేందుకు, నరకానికి ఒక గొయ్యి తవ్వాలనుకుంటారు. అయితే వారు లోతుగా తవ్వుతున్న కొద్దీ వింత సంఘటనలు సంభవిస్తాయి.
దెయ్యాల రూపంలో కొన్ని వికృత ఆకారాలు పిల్లలను భయపెడతాయి. ఉన్నట్లుండి అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోతుంది. మరి ఈ దుష్టశక్తుల నుంచి పిల్లలు తప్పించుకున్నారా? కుక్క ఆత్మ నిజంగానే నరకానికి వెళ్లిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
ఈ సినిమా ధైర్యవంతుల కోసమే!
ఓ పక్కన RGV లాంటి దర్శకులు తమ సినిమాలకు థియేటర్లలో ఒంటరిగా చూసే సవాలు విసిరిన సందర్భాలుండగా, ‘అంట్రమ్’ కూడా అలాంటి భావోద్వేగాన్ని టార్గెట్ చేసింది.
ప్రజలలో భయాన్ని రేకెత్తిస్తూ పబ్లిసిటీ చేసుకోవడమూ ఈ సినిమా స్ట్రాటజీ. కానీ సినిమా చూస్తే మాత్రం ఇది సాధారణ హారర్ కాదు, నిజంగా భయాన్నిపుట్టిస్తుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వింత సైకలాజికల్ ఎఫెక్ట్స్ సినిమాను అసాధారణంగా మలచాయి.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. కానీ ముందే చెప్పినట్టే.. ఈ సినిమాను ధైర్యవంతులే చూడాలి. పిల్లలకు అయితే పూర్తిగా దూరంగా ఉంచడమే మంచిది.
Read also: RCB: ఆర్‌సీబీ జట్టు విజయం పట్ల సినీ ప్రముఖులు ప్రశంసలు