हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Road accident: మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

Ramya
Road accident: మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

ఝబువాలో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని బలితెచ్చుకున్న ఘోర రోడ్డు ప్రమాదం

Road accident: మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝబువా జిల్లాలో ఓ భయానక Road accident అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.

మేఘ్‌నగర్ తహసీల్ పరిధిలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలో జరిగిన ఈ ఘోర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

శుక్రవారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితులు ఒక కుటుంబానికి చెందినవారు కావడంతో ఒక్కసారిగా ఊరంతా విషాదంలో మునిగిపోయింది. ఈ కుటుంబం వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Road Accident

ఓవర్‌ బ్రిడ్జ్ పై నిర్మాణంలో ఉన్న రహదారి.. అదుపు తప్పిన లారీ

మేఘ్​నగర్ తహసీల్​ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది.

ఈ క్రమంలో ఓవర్​- బ్రిడ్జ్​ని సిమెంట్ లోడ్​తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్​ ఉన్న వ్యాన్​పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్​ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు.

ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు.

చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు అధికం

ప్రమాదంలో మృతిచెందినవారిలో మృతుల్లో 4మంది పిల్లలు, 3 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు.

ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు.

పరారైన లారీ డ్రైవర్.. దర్యాప్తు కొనసాగుతోంది

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోందని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

బాధితులను ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. గాయపడిన ఇద్దరికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

వివాహానికి వెళ్లి వస్తూ బలైన కుటుంబం.. ఊరంతా శోకసంద్రం

వివాహానికి వెళ్లిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఇలా కుటుంబం మొత్తం మృత్యువుప్రపంచానికి వెళ్లిపోవడం మానవ మనసులను కలచివేస్తోంది.

ఒక్క పూటలో తొమ్మిది మంది ప్రాణాలు పోవడంతో బాధితుల గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. కుటుంబ సభ్యుల ఆకస్మిక మృతి తెలుసుకున్న వారు శోకసంద్రంలో మునిగిపోయారు.

సమీప గ్రామాల్లో కూడా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వ స్థాయిలో అన్ని విధాలుగా సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Read also: Odisha: ఒడిశా లో ఇంజక్షన్ వికటించి 5 గురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870