हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli: ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోసాను:కోహ్లీ

Anusha
Virat Kohli: ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోసాను:కోహ్లీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలవడంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిదని స్పష్టం చేశాడు. 18 ఏళ్ల తర్వాత దక్కిన ఈ విజయాన్ని అస్సలు ఊహించలేదన్నాడు. దాంతోనే విజయం ఖాయమైన వెంటనే భావోద్వేగానికి లోనయ్యానని తెలిపాడు.బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ రాత్రి తాను పసిబిడ్డలా నిద్రపోతానని తెలిపాడు.’ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరిది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్కిన విజయం.

అద్భుతమైన

ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోసాను. ఈ రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యాను. ఏబీ డివిలియర్స్(AB de Villiers) ఈ ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందే మాతో కలిసి సంబరాలు చేసుకోవాలని ఏబీడిని కోరాను. ఆర్‌సీబీ తరఫున ఏబీడీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికీ అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.ఈ జట్టుకు నేను విధేయుడిగా ఉన్నాను. ఏది ఏమైనా ఇతర ఆలోచనలు వచ్చినా ఈ జట్టుకు నేను అంకితమయ్యాను. నా గుండె, ఆత్మ బెంగళూరుతో ఉంది. నేను ఐపీఎల్ ఆడే వరకు ఆర్‌సీబీకే ఆడుతాను. ఈ రాత్రి నేను పసిబిడ్డలా నిద్రపోతాను.

 Virat Kohli: ఈ గెలుపు కోసం నా జీవితాన్ని దారపోసాను:కోహ్లీ
Virat Kohli

టెస్ట్ క్రికెట్‌

ఐపీఎల్‌లో నేను ఎక్కువ రోజులు ఆడలేను. మాకు ఒక ముగింపు తేదీ ఉంది. ఆలోపు నా సాయశక్తులా జట్టు విజయం కోసం ప్రయత్నిస్తాను. ఎట్టకేలకు ఈ టైటిల్ నా ఒడిలో ఉంచిన ఆ దేవుడికి ధన్యవాదాలు. జట్టుకు అండగా ఉండేందుకు నేను విభిన్న మార్గాలను అన్వేషిస్తాను. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్, టీమ్ అద్భుతమైదని. వేలం తర్వాత చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు. కానీ టోర్నీ ప్రారంభమైన రెండో రోజు మా జట్టు సత్తా ఏంటో అర్థమైంది. నా గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు. ఈ విజయం బెంగళూరు(Bengaluru) కోసమే. ఈ క్షణం నా కెరీర్‌లోనే ఉత్తమమైనది. అయితే టెస్ట్ క్రికెట్‌ కంటే ఇది ఐదు స్థాయిలు కిందే ఉంటుంది. కుర్రాళ్లు గౌరవం కావాలనుకుంటే టెస్ట్ క్రికెట్‌ను ఎంచుకోవాలి. ఈ ఫైనల్లో కృనాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతని స్పెల్ చాలా రోజులు గుర్తుంటుంది.’అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Read Also: RCB vs PBKS: పంజాబ్‌పై ఆర్‌సీబీ ఘన విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870