हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Raja Singh: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీజేపీకి రాజా సింగ్ సవాల్

Anusha
Raja Singh: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీజేపీకి రాజా సింగ్ సవాల్

భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారారు.ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాక నోటీసులు ఇచ్చేందుకు బీజేపీ(BJP) అధిష్టానం సిద్ధమవుతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంటి దొంగలంతా ఒక్కటయ్యారని తనకు నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలని రాజా సింగ్ సవాల్ చేయడం సంచలనంగా మారింది.

పూర్తి వివరాలు

రాజాసింగ్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) వ్యాఖ్యలకు మద్దతిస్తూ కామెంట్స్ చేయడంతో ఆయనను సస్పెండ్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో రాజాసింగ్ మాట్లాడుతూ బీజేపీలో దొంగలంతా ఒకటయ్యారని ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతాంటూ హెచ్చరించారు. ప్రస్తుతం రాజాసింగ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారింది.ఈ ప్రచారంపై రాజాసింగ్ స్పందిస్తూ తనకు నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. ఒకవేళ తనను గనక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు పార్టీకి ఎవరు నష్టం చేకూరుస్తున్నారో బయటపెడతానంటూ రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాక ఇంటి దొంగలంతా ఒకటయ్యారని వారంతా కలిసి బీజేపీని బీఆర్ఎస్ నాయకులకు తాకట్టు పెడుతున్నారంటూ రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. కొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే బీజేపీ పార్టీని బీఆర్ఎస్‌(BRS)కు తాకట్టు పెడతారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇలాంటి వారి బాగోతం బయటపెడతానని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో సంచలనంగా మారాయి.

 Raja Singh: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీజేపీకి రాజా సింగ్ సవాల్
Raja Singh

రాజా సింగ్‌ని సస్పెండ్ చేస్తారనే ప్రచారం

కొంతకాలంగా ఆయన చేస్తోన్న వ్యాఖ్యలే దీనికి కారణం అంటున్నారు విశ్లేషకులు. కొన్ని రోజుల క్రితం రాజా సింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చేలా వ్యాఖ్యానించారు. కవిత లిక్కర్ స్కామ్‌(Liquor scam)లో తీహార్ జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మాత్రమే పార్టీ టికెట్లు కేటాయించే స్థాయికి చేరుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని బీజేపీ అగ్ర నాయకులు భావిస్తున్నారట. రాజా సింగ్ చేసిన పని క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని అందుకే ఆయనకునోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడారని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిగణించిన తర్వాత బీజేపీ అధిష్టానం రాజా సింగ్‌కు క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చేందుకు రెడీగా ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

Read Also: Rain: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870