हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Veeraraj 1991: ‘వీరరాజు 1991’ (ఆహా) సినిమా రివ్యూ!

Ramya
Veeraraj 1991: ‘వీరరాజు 1991’ (ఆహా) సినిమా రివ్యూ!

రుద్ర విరాజ్ హీరోగా పరిచయమవుతూ, తానే దర్శకత్వం వహించిన సినిమా వీరరాజు 1991. అర్చన కథానాయికగా నటించిన ఈ సినిమా మే 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన ప్రేక్షకులకు సినిమా విడుదలైన విషయమే తెలియకపోయింది.

ఒక వారం తిరగక ముందే ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ లోకి వచ్చేసింది. కథాపరిశీలన, సాంకేతిక ప్రమాణాలు, నటుల పనితీరు వంటి అంశాలపై ఒకసారి గమనిద్దాం.

కథా నేపథ్యం: సముద్రపు పల్లెలోని పోరాటం

కథ నెల్లూరు సముద్రతీరానికి చెందిన ఓ చిన్న గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడి ప్రజల జీవితం పూర్తిగా సముద్రంపై ఆధారపడినది. చేపల వేటే జీవనాధారం. ఇలాంటి గ్రామానికి అండగా నిలిచే పోరాట యోధుడే పోతురాజు (రుద్ర విరాజ్).

గ్రామ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మారిన పోతురాజు, తన మరదలు వల్లీ (అర్చన) ప్రేమలో పడతాడు. అయితే, గ్రామంపై ఆధిపత్యాన్ని చూపించాలనుకునే దేవరాజు (అజయ్ ఘోష్) అనే నాయకుడు తన కొడుకు శేషు తో కలిసి గ్రామంలో భయాన్ని నెలకొల్పుతుంటాడు. శేషు – గబ్బిలంలా ఆడపిల్లల వెంటపడతాడు. ఎప్పుడో ఒకసారి వల్లీని వేధించబోయి పోతురాజు చేతిలో తన్నులు తినడంతో, ఇద్దరి మధ్య శత్రుత్వం మొదలవుతుంది.

ఇంతవరకూ ఒక మామూలు మాస్ కథే అనిపిస్తుంది. కానీ కథలోకి మిస్టరీ తెరలు తెరచేస్తాయి – సముద్రతీరంలో ఒక్కొక్కరుగా వ్యక్తులు మిస్సవ్వడం, పోలీస్ అధికారులు కూడా అదృశ్యమవడం మొదలవుతుంది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారిని రంగంలోకి దించి విచారణ చేపడుతుంది. అసలు ఆ మిస్టరీకి ముగింపు ఏమిటి? పోతురాజు వల్లీని పెళ్లి చేసుకుంటాడా? అనేదే మిగతా కథ.

Veeraraj 1991: 'వీరరాజు 1991' (ఆహా) సినిమా రివ్యూ!
Veeraraj 1991

విశ్లేషణ: కథలో ఊహించని మలుపులు ఉన్నా.. పట్టుకోలేకపోయిన ట్రీట్మెంట్

ఇది ఒక సాదారణ మత్స్యకార గ్రామ నేపథ్యంలో నడిచే కథ. నాయకుడికి నాయకత్వ లక్షణాలు, ప్రేమ, ప్రతినాయకుడు, గ్రామంలో భయాన్ని పెంచే శక్తులు – ఇవన్నీ చూసినట్టే అనిపిస్తుంది. దర్శకుడు కొత్తదనం కోసం కిడ్నాప్ మిస్టరీ అంసాన్ని ప్రవేశపెట్టాడు.

కానీ ఈ ట్రాక్ క్యూరియాసిటీని నింపలేకపోయింది. కథలోని మిస్టరీ డాంగిల్ చాలా డల్ గా అనిపిస్తుంది. పోతురాజు పాత్రకు ఇంకా బలమైన లక్షణాలు ఇవ్వవలసింది. అలాగే అజయ్ ఘోష్ పాత్రను కూడా బలంగా రాసుకోవలసిన అవసరం ఉంది. ఆయన నటన శక్తివంతంగా ఉన్నప్పటికీ, అతికించిన మీసాలు పాత్రను మరింత నమ్మకం కోల్పోయేలా చేశాయి.

డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాల్సింది. వాటికి సరిపోయే బాడీ లాంగ్వేజ్ కనిపించదు. ఫైట్స్ కూడా ఓల్డ్ ప్యాటర్న్ లోనే ఉండిపోయాయి. మాస్ సినిమా కావాలంటే ఇవన్నీ బలంగా ఉండాల్సిందే. కానీ ఈ సినిమాలో అవి అన్ని హాఫ్ బేక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది.

సాంకేతికంగా సరైన ప్రయత్నం – కానీ కథనం బలహీనమే

సినిమాలో ఫొటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ లాంటి అంశాలు కథకి తగినట్టే ఉన్నాయి. కానీ దర్శకుడైన రుద్ర విరాజ్ కి అనుభవం లోపించిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. కథా నిర్మాణంలో లోపాలు స్పష్టంగా చూపిస్తాయి. చిన్న చిన్న సన్నివేశాల్లో నాటకీయత లేకుండా పోయింది.

మొత్తానికి, వీరరాజు 1991 మాస్ కథ చెప్పే ప్రయత్నం చేసినా, కథన పరంగా, నటన పరంగా ఇంకా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఓటీటీలో లైట్ వాచ్ గా ప్రయత్నించవచ్చు కానీ థియేటర్లో చూసే స్థాయిలో ఎమోషనల్ డెప్త్ ఇవ్వలేకపోయింది.

Read also: Movie Review: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా రివ్యూ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870