ప్రముఖ కమెడియన్ అలీ (Ali), ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వివాదానికి తెరతీయబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్, సహనటుడు అలీపై కొంత వ్యంగ్యంగా, సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దదిగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై అలీ చేసిన స్పందన మాత్రం చాలా విలక్షణంగా, గంభీరంగా ఉంది. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పించారు.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ స్పందన:
అలీ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ, కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) గారికి మాట తూలింది. ఆయన సరదాగా అన్నారు. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు” అని అలీ అన్నారు. రాజేంద్రప్రసాద్ మంచి కళాకారుడని, ప్రస్తుతం ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారని కూడా అలీ చెప్పారు
కూతురి మృతికి భావోద్వేగ స్పందన:
అలీ రాజేంద్రప్రసాద్ మానసిక స్థితిని గుర్తు చేస్తూ, “ఆయన అమ్మ లాంటి కూతురు గాయత్రి, 2024 అక్టోబర్ 5న అనారోగ్యంతో మరణించింది. అది ఆయన జీవితాన్ని తుడిచిపెట్టేసింది. అలాంటి ఒక తండ్రిగా ఆయన మనోభావాలను అర్థం చేసుకోవాలి” అని మీడియా సహా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
Read also: Sonu Sood: శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్