ఫ్రాన్స్(France)లో ఫుట్‌బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్ల ఇద్దరు మృతి చెందగా, 192మంది గాయపడ్డారు. ఛాంపియన్స్ లీగ్‌లో పారిస్(Paris) సెయింట్-జర్మైన్-పీఎస్జీ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. దీనితో వారి అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.

పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం
ఈ సందర్భంగా ప్రత్యర్థి జట్టు అభిమానులతో మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రెచ్చిపోయిన అల్లరిమూకలు పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు వారు దుకాణాల దోపిడీలకూ పాల్పడినట్లు చెప్పారు. అసాంఘిక శక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. అల్లర్లకు బాధ్యులైన 559 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: NTR: మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్‌కు సభికుల