దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటీమణిగా గుర్తింపు పొందిన అర్చనా సింగ్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఈమధ్యే ఆమె ప్రపంచ అత్యున్నత శిఖరం అయిన హిమాలయాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (Everest Base Camp) కి చేరుకుని, తన జీవన ప్రయాణంలో మరో గౌరవమైన మైలురాయిని చేరుకుంది. అర్చనా సింగ్ ఈ అడ్వెంచరస్ ఎక్స్‌పెడిషన్ ద్వారా శారీరక, మానసిక స్థాయిల్లో తాను ఎంతగానో మెరుగయ్యానని చెప్పింది.
సినీ ప్రపంచం నుంచి హిమాలయ శిఖరాల దాకా..
అర్చనా సింగ్ తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటీమణి. తెలుగులో ఆమె నటించిన దమయంతి – కౌశిక్ వర్మ చిత్రం పెద్దగా ఆడకపోయినా, ఆమెకు గుర్తింపు తెచ్చిన ప్రయత్నాలలో అది ఒకటి. కానీ ఈ బ్యూటీకి సినీ పరిశ్రమకు వచ్చేవరకు రూట్ పూర్తిగా వేరే దిశలో ఉంది. తెలుగులో ఒక్క సినిమా చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. తాజాగా హిమాలయాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో పాల్గొంది. జీవితంలోనూ సమున్నత శిఖరాలు చేరుకోవడం తన లక్ష్యమని చెప్పుకొచ్చింది.
విద్యా, ఉద్యోగాలలో ప్రావీణ్యం
అర్చనా ఒక మంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె ఎంబీఏ కంప్లీట్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత విప్రో, ఐటీసీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో పనిచేసింది. అంతేకాకుండా కింగ్ ఫిషర్, జెయ్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అర్చనా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. తెలుగులో దమయంతి- కౌశిక్ వర్మ అనే చిత్రంలో నటించింది. ఈసినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి క్రేజ్ రాలేదు. అలాగే మిగతా భాషలలో ఆమె నటించిన చిత్రాలు సైతం హిట్ కాకపోవడంతో అర్చనకు ఆఫర్స్ రాలేదు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రయాణం – నిజమైన స్ఫూర్తి
తాజాగా అర్చనా సింగ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో చేరిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇది తన జీవితాన్ని మార్చేసిన ప్రయాణమని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో తను చేసిన ఉద్యోగాలు ఆ తర్వాత దక్షిణది అన్ని భాషలలో చేస్తున్న సినిమాలు ఇచ్చిన కిక్ కంటే ఎవరెస్ట్ ఎక్కడం తనకు మరింత కిక్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే పట్టుదలను, ప్రోత్సాహాన్ని ఇచ్చిందని తనకు తెలియకుండానే తనలో ఉన్న బెరుకును, భయాన్ని ఈ సాహస యాత్ర పటాపంచలు చేసిందని తెలిపింది. అలాగే ఈ అనుభవాన్ని , అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టమని తెలిపింది.
Read also: OTT Movie: ఓటీటీలోకి షకీలా బయోపిక్