हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Kavitha: కవిత పార్టీ మారడంపై స్పందించిన కేశవరావు

Anusha
Kavitha: కవిత పార్టీ మారడంపై స్పందించిన కేశవరావు

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు(K.Kesava Rao) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేరిక వల్ల పార్టీకి నిజంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అయితే ఆమె వల్ల పార్టీకి పెద్దగా మేలు జరుగుతుందని తాను అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేకే ఈ వ్యాఖ్యలు చేశారు.కవిత(Kavitha) మాటలను కాంగ్రెస్ పార్టీలో ఎవరూ అంత సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తనకు అనిపించడం లేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలోనే తన తుదిశ్వాస విడుస్తానని కేశవరావు తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖత చూపనందునే తాను పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరాల్సి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Kavitha: కవిత పార్టీ మారడంపై స్పందించిన కేశవరావు
Kavitha: కవిత పార్టీ మారడంపై స్పందించిన కేశవరావు

సమాధానం

కేశవరావు ‘ఆపరేషన్ కగారు’ అంశంపై కూడా ఆయన స్పందించారు. శాంతియుత చర్చలకు వస్తామని ఒకవైపు నుంచి ప్రతిపాదన వస్తే, దానిని ఎందుకు స్వాగతించకూడదని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టే ఆపరేషన్ల గురించి తాను పార్లమెంటులోనే మాట్లాడానని గుర్తు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని కేకే డిమాండ్ చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు యుద్ధాలు జరిగాయని, సైనిక చర్యలకు రాజకీయ ప్రమేయం ఎందుకని ఆయన నిలదీశారు. యుద్ధంలో గెలిచి పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలనుకుంటున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంటి వారి మాటలతో కాల్పుల విరమణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

Read Also: Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం తొలి విడతలో ఎంత మందికంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870