హైదరాబాద్ లో మిస్ వరల్డ్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమవుతోంది.మూడు వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు(Miss World 2025 Competitions)తుది అంకానికి చేరుకున్నాయి. శనివారం, మే 31న సాయంత్రం 6 గంటలకు హైటెక్స్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.మిస్ వరల్డ్ ఫైనల్స్ కోసం ప్రధాన వేదికను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి వచ్చిన నిపుణులైన డిజైనర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez), ఇషాన్ ఖట్టర్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
సోనూసూద్
ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోనూ సూద్(Sonu Sood), మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్(Manushi Chiller) వ్యవహరించనున్నారు. సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది (హ్యుమానిటేరియన్) పురస్కారాన్ని అందించనుంది. ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డును ఈసారి సోనూ సూద్ అందుకోనుండటం విశేషం.

ప్రతినిధులు
రెండు రోజుల క్రితం నిర్వహించిన “మల్టీమీడియా ఛాలెంజ్” పోటీల విజేతలను మిస్ వరల్డ్ సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది. ఈ ఛాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి నలుగురు సుందరీమణులు విజేతలుగా నిలిచారు. ఆసియా-ఓషియానియా నుంచి థాయ్‌లాండ్(Thailand), యూరప్ నుంచి మాంటెనీగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా-కరేబియన్ దీవుల నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు గెలుపొందారు. ఈ విజయంతో వీరంతా ఫైనల్స్‌లో టాప్-40 జాబితాలో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. శనివారం జరిగే తుది పోటీల్లో(final competitions) ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: BRS: బీఆర్ఎస్ నేత ఆత్మహత్య