పహల్గాం(Pahalgam) ఉగ్రదాడితో భారత్- పాకిస్థాన్(Bharath-Pakistan) మధ్య ఉద్రిక్తతలు నెలకొనగా, దాయాది దేశంతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్(Gujarath, Punjab, Rajasthan, JM)లో మాక్ డ్రిల్స్(Mock Drills) నిర్వహించనున్నారు అధికారులు. గురువారం సాయంత్రం మాక్ డ్రిల్స్ జరగనుండగా, ఇప్పటికే అలర్టె ప్రకటించారు. సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై మాక్ డ్రిల్స్‌లో అవగాహన కల్పించనున్నారు.
మాక్ డ్రిల్‌లో ఏమి ఉంటాయి?
దాడి జరిగినప్పుడు విద్యార్థులు, యువకులు స్వీయరక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో కూడా అవగాహన కల్పించనున్నారు అధికారులు. గగనతల దాడులపై హెచ్చరించడం, అప్పటికప్పుడు బ్లాకౌట్ చేసే తీరును వివరించడం, ముఖ్యమైన వ్యవస్థల్ని శత్రువు కంటపడనీయకుండా చేయడం వంటివి మాక్ డ్రిల్ ఉంటాయి. సైరన్ మోగగానే పలు ప్రాంతాల్లో ప్రజలు రక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు.

స్కూల్ విద్యార్థులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిలుపు
అయితే మాక్ డ్రిల్స్‌ను ఆపరేషన్ అభ్యాస్గా పిలుస్తున్నారు. అయితే మాక్ డ్రిల్స్‌లో పాల్గొనాలని అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోమ్‌గార్డ్స్, ఎన్‌సీసీ కోర్, ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూయువ కేంద్ర సంఘటన్, కాలేజ్‌లు, స్కూల్ విద్యార్థులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాడనికి కొన్ని గంటల ముందు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని మే 7న ఆదేశించింది.
దేశం మొత్తం మాక్ డ్రిల్స్
1971లో పాకిస్థాన్ యుద్ధం జరిగి దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. కార్గిల్ యుద్ధ సమయంలో అవి సరిహద్దు జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. ఈసారి దేశం మొత్తం నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించింది.
ఇప్పటికే 250 ప్రదేశాల్లో పూర్తి!
మొదటి దానిలో రాజధాని దిల్లీ, ముంబయి, సూరత్, వడోదర, చెన్నై, కల్పకం, నరోరా వంటివి ఉన్నాయి. రెండో విభాగంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉన్నాయి. మూడో విభాగంలో 45 జిల్లాలు ఉన్నాయి. అలా మొత్తం ఇప్పటికే 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 250 ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. ఇప్పుడు మిగతా చోట్ల జరగనున్నాయి.
Read Also: France: ఫ్రాన్స్ అసిస్టెడ్ డైయింగ్ బిల్లుకు ఆమోదం