ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 228 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగా క్వాలిఫయర్-1కి కూడా అర్హత సాధించింది. ఆర్సీబీ(RCB) ఈ విజయం 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఇంతకు ముందు ఏ జట్టు కూడా సాధించలేని ఘనతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధించింది. ఆర్సీబీ 14 మ్యాచ్‌లలో 9 విజయాలు, 4 ఓటమలతో లీగ్ దశను ముగించింది. ఈ క్రమంలో ఆర్సీబీ మొత్తం 19 పాయింట్లను సాధించింది.
హోంగ్రౌండ్స్
లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ క్వాలిఫయర్-1కు దూసుకెళ్లింది. దీంతో పాటు ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు తమ సొంత మైదానంలో కంటే ప్రత్యర్థి జట్లకు చెందిన మైదానాల్లోనే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో లీగ్ దశలో ప్రత్యర్థి జట్లతో వాటి హోంగ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లన్నింటినీ గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఆర్సీబీ ఈ సీజన్‌లో సొంత మైదానం కాకుండా ప్రత్యర్థి జట్ల మైదానాల్లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) లో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ను ఓడించిన ఆర్సీబీ ఆ తర్వాత సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లను వారి సొంత మైదానాల్లోనే మట్టికరిపించింది.

స్టేడియం
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు టాప్-2 స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ మే 29న చంఢీగఢ్ లోని పీసీఏ స్టేడియం(PCA Stadium)లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ఫైనల్ కు చేరుకోవడానికి మరో అవకాశం లభిస్తుంది. మొదటి క్వాలిఫయర్ లో ఓడిన జట్టు తర్వాత ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ఫైనల్ మ్యాచ్‌కు చేరుకుంటారు. ఆర్సీబీ ఈసారి 18 ఏళ్ల కరువును అంతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం వారి అభిమానులకు గర్వకారణం మాత్రమే కాదు మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఒక మైలురాయి కూడా.
Read Also: RCB vs LSG :లక్నో పై ఆర్సీబీ ఘన విజయం