తమిళ హీరో కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్(Kamal Haasan) తొలుత “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై ఉన్న కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘ఇక్కడ ఉన్నంది నా కుటుంబం. అందుకే ఆయన (శివరాజ్‌కుమార్) ఇక్కడకి వచ్చారు.అందుకే నా ప్రసంగాన్ని ప్రాణం, బంధం, తమిళం అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది, కాబట్టి మీరు కూడా అందులో భాగమే” అని అన్నారు.ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప(Vijayendra Yediyurappa) స్పందిస్తూ కమల్ హాసన్ ‘సంస్కారం లేని వ్యక్తి’ అని, కన్నడ భాషను అవమానించారని ఆయన ఆరోపించారు. ‘మాతృ భాషను ప్రేమించడం మంచిదే కానీ, ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు. కన్నడ, సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్‌కుమార్(Shivarajkumar)ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడమే కాదు అహంకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది’ అని అన్నారు.
మనోభావాలను
దక్షిణాదికి సామరస్యాన్ని తీసుకురావాల్సిన కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని అవమానిస్తూ, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు.ఇప్పుడు, 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించారు.కమల్ హాసన్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. అంతేకాదు, కమల్ హాసన్ కన్నడిగుల ఔదార్యాన్ని మర్చిపోయారని, ఆయన వ్యక్తిత్వం ‘అవిధేయతతో నిండి పోయింది’ అని విజేయంద్ర(Vijayendra)అన్నారు. ఆయన భాషా చరిత్రలో నిపుణుడు కూడా కాదని విమర్శించారు.

విడుదల
కన్నడ భాషా అభిమాన సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాయి. బెంగళూరులో కమల్ హాసన్ పోస్టర్లను చింపేసిన కన్నడిగులు. ‘తమిళ భాషను గొప్పగా చూపిస్తూ కన్నడను చిన్నచూపు చూడటం’ తగదని పేర్కొన్నారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే కర్ణాటకలో త్వరలోనే విడుదల కాబోయే కమల్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఇది ఇలాఉంటే,కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో 38 ఏళ్ల తర్వాత కమల్ నటించడం విశేషం. ఈ ఇద్దరూ గతంలో 1987లో వచ్చిన క్లాసిక్ మూవీ ‘నాయకుడు’ కోసం కలసి పనిచేశారు.
Read Also : Jr NTR : హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ప్రముఖులు