జిల్లాకు చారిత్రక గుర్తింపు పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో జిల్లాకు చారిత్రక గుర్తింపు తిరిగి లభించింది. కడప జిల్లా పేరును మళ్లీ ‘వైఎస్సార్ కడప జిల్లా’గా పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఉత్తర్వులు వెలువడినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థంగా, ఆయన స్వస్థలమైన కడప జిల్లాకు 2010లో ‘వైఎస్సార్ కడప జిల్లా’గా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ(YCP) ప్రభుత్వం ‘కడప’ పదాన్ని తొలగించి కేవలం ‘వైఎస్సార్ జిల్లా’ (YSR District) గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఈ చర్యపై అప్పట్లో ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జిల్లా చారిత్రక గుర్తింపును తొలగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.

విపక్షా, ప్రజల ఒత్తిడికి మళ్లీ మార్పు
జిల్లా పేరులో నుండి చారిత్రకమైన ‘కడప’ అనే పదాన్ని తొలగించడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, అలాగే రాజకీయ నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ప్రగతికి తోడ్పడిన ప్రాంతం అయిన కడపకు దూరంగా వేసినట్టు ఉండే ఈ చర్యను వారు తిరస్కరించారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్ష నేతగా జిల్లాలో పర్యటించిన సందర్భంలో స్పందిస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేరును మళ్లీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు సత్యకుమార్ ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న పేరుమార్పు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. జిల్లాకు చెందిన ప్రజల అభిప్రాయాలను, సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు ఈ మార్పును తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి హర్షధ్వానాలు
జిల్లా పేరు పునరుద్ధరణకు సంబంధించి జీవో విడుదలైన తర్వాత జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో ప్రజలు స్వాగత ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘‘కడప’’ (Kadapa) అనే పదం తీసివేయడం వల్ల జిల్లా చారిత్రక గౌరవం తక్కువైంది అనే భావన ప్రజల్లో బలంగా ఉండింది. ఇప్పుడు ఆ గౌరవాన్ని తిరిగి పొందిన భావన ప్రజల మధ్య కనిపిస్తోంది.
ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించిందన్న అభిప్రాయం వెల్లివెస్తోంది. జిల్లా పేరు కేవలం పేరే కాదు, అది అక్కడి ప్రజల గౌరవానికి, వారసత్వానికి నిదర్శనమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.
Read also: Kakani Govardhan Reddy: కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించిన వెంకటగిరి కోర్టు