టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్(Shubman Gill) ను ఎంచుకుంది బీసీసీఐ,ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది.టీమిండియాకు నాల్గవ అతిపిన్న వయస్కుడిగా కెప్టెన్ అయ్యాడు. రిషబ్ పంత్(Rishabh Pant) ను వైస్ కెప్టెన్ గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే. జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌ను చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపించినప్పటికీ సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టేసారు.బుమ్రాను తరుచుగా గాయాలు వెంటాడుతున్న నేపథ్యంలోనే అతన్ని లీడర్‌షిప్ గ్రూప్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. అగార్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.’ఫిజియోలు, వైద్యులు చెప్పిన దాన్ని బట్టి బుమ్రా(Jasprit Bumrah) సిరీస్‌లో పూర్తిగా ఆడతాడని అనుకోవట్లేదు. మూడు లేదా నాలుగు ఎన్ని మ్యాచ్‌ల్లో ఆడతాడో చూడాలి’అని అగార్కర్ తెలిపాడు. శుభ్‌మన్ అద్భుతమైన క్రికెటర్ అని, ఏడాదిగా అతను నిలకడగా రాణిస్తున్నాడని గుర్తు చేశాడు.
భారత జట్టు
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌లకు ఇంగ్లాండ్ పర్యటనకు అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025లో షమీ ప్రత్యేకంగా ఏమి చేయలేకపోవడమే దీనికి కారణం. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ అతడిని జట్టులో చేర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

ఇండియా vs ఇంగ్లండ్ సిరీస్
ప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉందన్న గవాస్కర్ అనుభవంతో గిల్ మరింత రాటు దేలుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటర్‌గా అతను మరింత రాణించడానికి సారథ్య బాధ్యతలు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నామని తెలిపాడు. కుర్రాళ్లకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నాడు.మొదటి టెస్ట్ మ్యాచ్ (జూన్ 20-24)రెండవ టెస్ట్ మ్యాచ్ (జూలై 2-6)మూడవ టెస్ట్ మ్యాచ్ (జూలై 10-14)నాల్గవ టెస్ట్ మ్యాచ్ (జూలై 23-27)ఐదవ టెస్ట్ మ్యాచ్ (జూలై 31-ఆగస్టు 4).
Read Also : PBKS vs DC: పంజాబ్ కింగ్స్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?