हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Abhishek Sharma: టీ20 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ అత్యధిక స్కోర్ ఘనత

Anusha
Abhishek Sharma: టీ20 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ అత్యధిక స్కోర్ ఘనత

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 42 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)పై అద్భుత విజయం సాధించింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 మ్యాచ్‌లలో భారీ ఘనత సాధించాడు. అభిషేక్ శర్మ తన దూకుడు శైలితో ప్రత్యేకరికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. 17 బంతుల్లో 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ టీ20లలో 4 వేల పరుగుల మైలురాయిని దాటాడు. టీ20ల్లో 4,000 పరుగులు చేసిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా అభిషేక్ శర్మ(Abhishek Sharma) నిలిచాడు. అభిషేక్ శర్మ గత సంవత్సరమే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్వల్ప కాలంలోనే అభిషేక్ శర్మ టీ20లలో 4 వేల పరుగులు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అగ్రస్థానం

అభిషేక్ శర్మ మరో రికార్డును కూడా సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో 4 వేల పరుగులు చేసిన వారిలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్నఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ అలెన్(Finn Allen) అగ్రస్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ఇప్పటివరకు టీ20 మ్యాచ్‌ల్లో 4,070 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ స్ట్రైక్‌రేట్ 170.93గా ఉంది. రెండో స్థానంలో ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. అతను 9,175 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ 168.85గా ఉంది. అభిషేక్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. అభిషేక్ 166.05 స్ట్రైక్‌రేట్‌తో 4,002 పరుగులు చేశాడు.

Abhishek Sharma: టీ20 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ అత్యధిక స్కోర్ ఘనత
Abhishek Sharma: టీ20 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ అత్యధిక స్కోర్ ఘనత

స్ట్రైక్‌రేట్‌

ఈ జాబితాలో అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ భారత క్రికెటర్లలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ నిలకడగా పరుగులు సాధించలేడనే విమర్శలు ఉన్నప్పటికీ అధిక స్ట్రైక్‌రేట్‌తో ఆడుతూ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ 48 బంతుల్లో అత్యధికంగా 94 పరుగులు సాధించగా అభిషేక్ శర్మ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో ఆర్సీబీ జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ అత్యధికంగా 62 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కెప్టెన్ పాట్ కమిన్స్ గరిష్టంగా 3 వికెట్లు పడగొట్టాడు.

Read Also: Jitesh Sharma: ఈ ఓటమితో మా తప్పిదాలు తెలిసొచ్చాయన్న జితేష్ శర్మ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870