हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: భారత్ కు పాకిస్థాన్ గగనతల మూసివేత మరో నెల రోజులు పొడిగింపు

Vanipushpa
Pakistan: భారత్ కు పాకిస్థాన్ గగనతల మూసివేత మరో నెల రోజులు పొడిగింపు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్(Bharath Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాక్ (Pakistan)ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులు దాడులు చేసి నేటమట్టం చేశాయి. ఈ ఘటనపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్ పై పగ పెంచుకుంది. కాశ్మీర్, పంజాబ్(Kashmir, Punjab) సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ లతో దాడులకు దిగింది. అయితే ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన కుదరడంతో పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి.

Pakistan: భారత్ కు పాకిస్థాన్ గగనతల మూసివేత మరో నెల రోజులు పొడిగింపు
Pakistan: భారత్ కు పాకిస్థాన్ గగనతల మూసివేత మరో నెల రోజులు పొడిగింపు

భారత్ కు ఆర్థికంగా నష్టం
ఈ క్రమంలో భారత్ కు పాకిస్థాన్ మరో షాక్ ఇచ్చింది. అయితే గతంలో భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. పాక్ గగనతలం నుంచి భారత్ విమానాలు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్. అయితే ఈ నిర్ణయాన్ని తాజాగా మరో నెల రోజులపాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో భారత్ కు ఆర్థికంగా నష్టంగా భావించవచ్చు.
రోజులపాటు పొడిగిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్ విమానాలు పాకిస్థాన్ గగనతలం నుంచి వెళ్లకుండా పాకిస్థాన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని మరో నెల రోజులపాటు పొడిగిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిషేధానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పాక్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది.
రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ప్రకారం..
అయితే అంతర్జాతీయ వైమానిక సంస్థ(ICAO) రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ప్రకారం ఒక దేశం.. మరో దేశానికి విధించే గగనతలం ఆంక్షలు ఒకేసారి నెల రోజులు కంటే ఎక్కువ కాలం విధించరాదు. పాకిస్థాన్ గతంలో విధించిన ఈ నిషేధం మే 23 వరకు అమల్లో ఉంటుంది. ఆలోపు ఈ నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ పలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ రద్దు.. ఇలా అనేక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే భారత్ పై ప్రతీకారంగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Ukrainian: ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడి సలహాదారుడు హత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870