हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: సీఎస్కే ఓటమి పై ధోని ఏమన్నారంటే?

Anusha
IPL 2025: సీఎస్కే ఓటమి పై ధోని ఏమన్నారంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా,రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) చివ‌రి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది,వైభ‌వ్ సూర్య‌వంశీ(57) అర్ధ శ‌త‌కంతో విరుచుకుప‌డ‌గా కెప్టెన్‌ సంజూ శాంస‌న్‌(41) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీఎస్కే తరఫున బ్యాటింగ్ చేసిన ఆయుష్ మాత్రే అత్యధికంగా 43 పరుగులు చేశాడు. ఇది కాకుండా డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులు, శివం దూబే 39 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బౌలర్లలో ఆకాష్ మధ్వల్, యుధ్వీర్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు.దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాజస్థాన్ తరఫున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వైభవ్ సూర్యవంశీ 57 పరుగులు చేసి అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ 41, యశస్వి జైస్వాల్ 36, ధ్రువ్ జురేల్ అజేయంగా 31 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.

IPL 2025: సీఎస్కే ఓటమి పై ధోని ఏమన్నారంటే?
IPL 2025: సీఎస్కే ఓటమి పై ధోని ఏమన్నారంటే?

బౌలింగ్‌

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ తమ ఓటమి గల కారణాలను తెలిపాడు.’మా లక్ష్యం పోరాడదగినదే. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోతే లోయరార్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. 20 ఓవర్లు ఆడలేకపోతాం. డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను రిస్కీ షాట్స్ ఆడాడు. మా రన్ రేట్ కూడా బాగానే ఉంది. కానీ లోయరార్డర్‌లో మేం కొంచెం మెరుగవ్వాలి. వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుకు నష్టం చేసింది. అన్షుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.కానీ అతను చాలా వేగంగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు అతనే మా బౌలింగ్ బాధ్యతను తీసుకున్నాడు. కంబోజ్ మంచి యార్కర్లు కూడా వేయగలడు.పవర్ ప్లే మాకు బలహీనతగా మారింది. డిఫెండ్ చేసుకునేటప్పుడు పవర్ ప్లేలో ఎక్కువగా పరుగులు ఇవ్వకూడదు. మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశం ఇది. తొలి 6 ఓవర్లలోనే అన్షుల్ 3 ఓవర్లు వేసాడు. సీమ్ మూమెంట్ లేకుండా బ్యాటర్లు సెట్ అయిన తర్వాత పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. కుర్రాళ్లంతా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాలి. 200 స్ట్రైక్‌రేట్ కోసం కాకుండా పరిస్థితులు తగ్గట్లు ఆడటం నేర్చుకోవాలి. ముఖ్యంగా బ్యాటర్లు తమను తాము నమ్ముకోవాలి.యువ బ్యాటర్లంతా తొలి సీజన్‌ ఎలా ఆడారో అదే జోరును కొనసాగించడం చాలా ముఖ్యం.నిలకడగా రాణించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే బ్యాటర్‌గా మరింత ఎదగడానికి సహాయపడుతుంది.’అని ధోనీ చెప్పుకొచ్చాడు.

Read Also: IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870