టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా సింగిల్. తమిళ డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.రిలీజ్ కు ముందే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు. దీంతో రిలీజ్ కు ముందే సింగిల్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూల్లు రాబట్టింది.అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. మొత్తానికి సింగిల్ తో మరో సూపర్ హిట్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పటికే ఈ సినిమా రూ. 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సింగిల్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.ఆ వార్త ఏంటంటే, సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) ఓటీటీ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అంటే జూన్ 6వ తేదీన లేదా జూన్ 12న సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందన్నమాట.

కథ ఏంటంటే
విజయ్ (శ్రీ విష్ణు) ఒక బ్యాంకు ఉద్యోగి. అయితే లైఫ్‌లో ఎప్పటికీ ఇలా సింగిల్ సింతకాయలానే మిగిలిపోతానా అంటూ భయపడుతుంటాడు. ఇక తన ఫ్రెండ్ అరవింద్ (వెన్నెల కిషోర్)తో కలిసి సింగిల్ జీవితాన్ని డీలాగా సాగిస్తుంటాడు.ఆ సమయంలో ఒకసారి మెట్రోలో పూర్వ (కేతిక శర్మ)ని మొదటి చూపులోనే చూసి లవ్ చేస్తాడు. అయితే డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తే నో చెబుతుందేమోననే భయంతో ఆమె వర్క్ చేసే కారు షోరూమ్‌కి కస్టమర్ అనే వంకతో వెళ్లి విసిగిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత కారు కొనడానికి కాదు,నిన్ను లవ్ చేయడానికే నీ చుట్టూ తిరిగానని చెప్పడంతో ఆమె హర్ట్ అయి మోసం చేశావంటూ ఛీ కొట్టి వెళ్లిపోతుంది.ఓ పక్క ఈ ట్రాక్ నడుస్తుండగా అనుకోకుండా కలిసిన హరిణి (ఇవానా) విజయ్‌ని ప్రేమిస్తున్నా అంటూ ప్రపోజ్ చేస్తుంది. ఇలా ఓ పక్క విజయ్ పూర్వని ఇష్టపడుతుంటే హరిణి విజయ్‌ని లవ్ చేస్తుంటుంది. మరి ఈ ట్రయాంగిల్ స్టోరీ చివిరికి ఏమైంది వీళ్లిద్దరిలో ఎవరు చివరికి విజయ్(Vijay)కి సెట్ అయ్యారు లేక ఇద్దరూ హ్యాండ్ ఇచ్చారా? అసలు హరిణి విజయ్‌ని ఎందుకు లవ్ చేసింది అనే విషయాలు వెండితెరపై చూడాల్సిందే.
Read Also: War 2 Movie: వార్ 2 సినిమా టీజర్ చూశారా